ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Thummala: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ABN, Publish Date - Jan 14 , 2025 | 06:54 AM

Minister Thummala Nageswara Rao: రైతన్న ఇంట సిరులు కురిపించే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణతో అడుగులేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్ గెలలు టన్ను ధర రూ.20 వేలకు పైగా ఉందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు యాంత్రీకరణ దిశగా తెలంగాణ వ్యవసాయం అడుగులు వేస్తు్ందని చెప్పారు.

Minister Thummala Nageswara Rao

భద్రాద్రి కొత్తగూడెం: రానున్న రోజుల్లో దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతితో రైతన్నల ఇంట సంతోషాలు వెల్లివిరియాలని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భీమా పథకాలతో యావత్ దేశానికే తెలంగాణ మార్గదర్శిగా నిలిచిందని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటనను ఇవాళ(మంగళవారం) విడుదల చేశారు. వచ్చే సంక్రాంతి నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్, వైరా లింక్ కెనాల్, మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు పూర్తయి దశాబ్దాల సాగునీటి కల సాకారం అవుతుందని తెలిపారు. రైతన్న ఇంట సిరులు కురిపించే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణతో అడుగులేస్తోందని అన్నారు. పామాయిల్ గెలలు టన్ను ధర రూ.20 వేలకు పైగా ఉందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు యాంత్రీకరణ దిశగా తెలంగాణ వ్యవసాయం అడుగులు వేస్తు్ందని చెప్పారు. సీఎం రేవంత్ ప్రజా పాలనలో రైతు రాజ్యం వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - Jan 14 , 2025 | 06:56 AM