Share News

Kishan Reddy: రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం ఆపండి

ABN , Publish Date - Apr 01 , 2025 | 05:48 AM

హెచ్‌సీయూలో పర్యావరణ విధ్వంసాన్ని నిలిపివేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములు అమ్మడం, విద్యార్థుల ఆందోళనను అణచివేయడం, పచ్చదనాన్ని నాశనం చేయడం ప్రభుత్వ నిరంకుశ ధోరణి అని ఆయన వ్యాఖ్యానించారు.

Kishan Reddy: రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం ఆపండి

సర్కారు చర్యలను ఖండిస్తున్నాం: కిషన్‌రెడ్డి

ప్రకృతికి నష్ట కలిగించొద్దు: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

అవసరమైతే ప్రత్యక్ష కార్యచరణ చేపడతాం: ఈటల

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): హెచ్‌సీయూలో పర్యావరణ విధ్వంసాన్ని నిలిపివేయాలని కేంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు కాంగ్రెస్‌ సర్కారు తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల గొంతునొక్కడం, విద్యార్థుల ఆందోళనను క్రూరంగా అణిచివేయడం, పచ్చదనాన్ని, జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేయడం, నిధుల కోసం హైదరాబాద్‌ పర్యావరణాన్ని పణంగా పెట్టడం.. ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయం ఇక్కడి జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌కు ఆక్సీజన్‌ అందిస్తున్న ఈ ప్రాంతపు అటవీసంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడాలని ‘ఎక్స్‌’ వేదికగా కోరారు. కాగా, హెచ్‌సీయూ.. తెలంగాణకే తలమానికమని, కొన్ని వేలమంది నిష్ణాతులను తీర్చిదిద్దిందని ఎంపీ ఈటల రాజేందర్‌ గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ భూములు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ‘‘హైదరాబాద్‌ లో శ్మశానవాటికలకు కూడా జాగా దొరకని పరిస్థితి వచ్చింది. పార్కులకు సైతం స్థలం లేక కాంక్రీట్‌ జంగల్‌గా మారింది. రేవంత్‌ రెడ్డి ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారో తెలియడం లేదు. విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. యూనివర్శిటీ భూముల్లో ఎన్నో వనరులు ఉన్నాయని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ భూమి అయినప్పటికీ... ప్రకృతికి నష్టం కలిగించే చర్యలు తీసుకోవడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా బీజేపీ నిజమైన పోరాటం చేస్తుందని చెప్పారు.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 05:49 AM