Share News

Anand Mahindra: జీబ్లీ క్లబ్‌లోకి మహీంద్రా.. ఫోటో షేర్ చేసిన బిజినెస్ టైకూన్

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:07 PM

Anand Mahindra Ghibli character: ప్రస్తుతం సోషల్ మీడియాను జీబ్లీ మేనియా ఊపేస్తోంది. ఇన్ స్టా, ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఎక్స్ ఇలా ఎక్కడ చూసినా జీబ్లీ స్టైల్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ జీబ్లీ క్లబ్‌లోకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా చేరారు.

Anand Mahindra: జీబ్లీ క్లబ్‌లోకి మహీంద్రా.. ఫోటో షేర్ చేసిన బిజినెస్ టైకూన్
Ghibli style art of Anand Mahindra

Anand Mahindra Ghibli character: చాట్‌జీపీటీ (ChatGPT)లో అందుబాటులోకి వచ్చిన రోజు నుంచి జీబ్లీ స్టూడియో ఫీచర్ యూజర్లకు తెగ నచ్చేసింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఓపెన్ చేసినా జీబ్లీ ఫొటోలే సందడి చేస్తున్నాయి. నెటిజన్లు తమ ఫొటోలతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ప్రముఖుల చిత్రాలను జీబ్లీ ఫొటోలుగా మారుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే ఇటీవల ఓ నెటిజన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫొటోను జీబ్లీఫై చేసి ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన తర్వాత ఆనంద్ మహీంద్రా దాన్ని తన ఖాతాలో ట్యాగ్ చేయడంతో వైరల్‌గా మారింది.


జీబ్లీ స్టైల్‌లో తనను తాను చూసుకుని సంతోషంతో మురిసిపోయారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. ఇదేదో చాలా బాగుంది. నాకూ జీబ్లీ ఫొటోలు ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలనుందనే వ్యాఖ్యలు ట్యాగ్ చేస్తూ.. ఫ్యాన్ రూపొందిన జీబ్లీ ఫొటోను షేర్ చేశారు.'ఇంజనీర్స్ వ్యూ'అనే పేరుతో ఒక X యూజర్ మహీంద్రా బైక్ నడుపుతున్నట్లుగా జీబ్లీ ఇమేజ్ స్టైల్ ఫొటో రూపొందించిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీ (ChatGPT)లో అందుబాటులోకి తెచ్చిన జీబ్లీ జపనీస్ యానిమేషన్ స్టూడియోకు చెందింది. 1985లో హయావో మియాజాకి, ఇసావో టకాహటా, తోషియో సుజుకి ఈ స్టూడియోను స్థాపించారు. ఇక, జీబ్లీ అంటే లిబియన్ అరబిక్ భాషలో ఎడారి వేడి గాలి అని అర్థం. చేత్తో గీసే యానిమేషన్, భావోద్వేగపూరితమైన కథనాలు, సంక్లిష్టమైన బ్యాక్‌గ్రౌండ్స్‌తో జీబ్లీ స్డూడియో రూపొందించిన యానిమేటెడ్ సిరీస్‌లు, చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా, జిబ్లీ ఫీచర్ రిలీజ్ అయిన రోజు ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఏ స్థాయిలో అంటే "దయచేసి ఈ ఫీచర్ వాడకాన్ని కాస్త తగ్గించండి. మా జీపీయూలు కరిగిపోతున్నాయి. సిబ్బంది నిద్రాహారాలు లేక కష్టపడుతున్నారు." అని ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ నెటిజన్లకు రిక్వెస్ట్ చేశాడంటేనే జీబ్లీ ఇమేజ్ ఫీచర్స్ యూజర్స్ క్రియేట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.


Read Also: ITR Filing 2025: ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..

Lays Offs: ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి

Today Gold Rate: స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

Updated Date - Apr 03 , 2025 | 03:11 PM