Layout Regularization Scheme: ఎల్‌ఆర్‌ఎ్‌సలో ఈ నెల కూడా 25శాతం రాయితీ
ABN , Publish Date - Apr 02 , 2025 | 02:26 AM
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంలో 25% రాయితీని ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తితో గడువు పెంచి, బుధవారం దీనిపై అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది.

గడువు పొడిగింపుపై నేడు ఉత్తర్వులు!
ఏప్రిల్ 1న ఫీజు చెల్లించిన వారికీ రాయితీ ఇచ్చిన అధికారులు
హైదరాబాద్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎ్‌స)లో 25 శాతం రాయితీని ఈ నెల కూడా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. గత నెల 25 శాతం రాయితీని ప్రకటించిన ప్రభుత్వం.. 31వ తేదీ వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తితో ఈ గడువును మరో నెల రోజులు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు రానున్నాయని పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మార్చి 31న 43,700 మంది ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. ఆ ఒక్క రోజే ఫీజు కింద రూ.124 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 4,43,000 మంది ఫీజు చెల్లించారు. అధికారులు మంగళవారం (ఏప్రిల్ 1న) కూడా ఎల్‌ఆర్‌ఎస్ కింద ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీని వర్తింపజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News