ఎల్‌ఆర్‌ఎస్..గందరగోళం
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:14 PM
మంచిర్యా ల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో రోజుకో వింత ఘ టన చోటుచేసుకుంటోంది. కార్యాలయంలో జరుగు తున్న పరిణామాలతో వినియోగదారులు కంగుతి నాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రిజిస్ర్టేషన్ చేసే స్థలానికి సంబంధం లేకుండా అడ్డగోలు ఫీజు లు వడ్డిస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

200 గజాల స్థలానికి రూ. 3కోట్లు రిజిస్ర్టేషన్ ఛార్జీలు
మంచిర్యాల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో వెలు గు చూసిన ఘటన
బిల్లు చూసి కంగుతిన్న వినియోగదారుడు
వెబ్‌సైట్‌లో నెలకొన్న లోపమే కారణమంటున్న అధికారులు
మరో ఘటనలోనూ వినియోగదారుడికి భారీగా వడ్డింపు
మంచిర్యాల, మార్చి29 (ఆంధ్రజ్యోతి): మంచిర్యా ల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో రోజుకో వింత ఘ టన చోటుచేసుకుంటోంది. కార్యాలయంలో జరుగు తున్న పరిణామాలతో వినియోగదారులు కంగుతి నాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రిజిస్ర్టేషన్ చేసే స్థలానికి సంబంధం లేకుండా అడ్డగోలు ఫీజు లు వడ్డిస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ వినియోగదారుడు 200 చదరపు గజా ల స్థలానికి రిజిస్ర్టేషన్ కోసం వెళితే వెబ్‌సైట్‌లో ఏ కంగా రూ. 3కోట్లపై చిలుకు ఫీజు చూపించడంతో ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యాడు. ఈ వింత ఘటన ఇటీవల చోటు చేసుకుంది.
ఆదినుంచి అపవాదులే...
మంచిర్యాల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఎల్ ఆర్‌ఎస్ ప్రక్రియలో ఆది నుంచి అపవాదులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అసలు చెల్లించిన ఫీజులే కనబడక పోగా వినియోగదారులు ఆందోళన కు గురయ్యారు. దీనికి తోడు గతంలో చెల్లించిన ఎల్ ఆర్‌ఎస్ ఫీజులు కూడా వెబ్‌సైట్‌లో అవికానరావ డం లేదంటూ రిజిస్ర్టేషన్‌లు చేసేందుకు అధికారు లు ససేమిరా అనడంతో ఫీజులు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. తాజాగ రిజిస్ర్టేషన్ చేసే స్థలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా చార్జీలు వడ్డిస్తుండడంతో గంద రగోళానికి గురవుతున్నారు. తాజాగా సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో జరిగిన ఘటనలో వినియోగదారు లతో పాటు అధికారులు సైతం నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఓ వినియోగదారుడు తనకు చెందిన 200 చదరపు గజాల స్థలాన్ని రిజిస్ర్టేషన్ చేసుకునేం దుకు డాక్యుమెంట్ రైటర్ ద్వారా దరఖాస్తు చేసుకు న్నాడు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించేందుకు యత్నించ గా మొత్తం రూ. 3,27,74,892 చూపించింది. ఇందు లో రెగ్యులరైజేషన్ చార్జీల కింద రూ. 69,488,14 శా తం ఓపెన్ స్పేస్ చార్జీల కింద రూ. 4,36,31,700 చూపించింది. మొత్తం రిజిస్ర్టేషన్ చార్జీల కింద 4,37,01,189 చెల్లించే విధంగా ఆన్‌లైన్‌లో రసీదు వ చ్చింది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కింద వెయ్యి రూపాయ లు చెల్లించినందున దాంతో పాటు సకాలంలో రిజి స్ర్టేషన్‌కు ముందుకు వచ్చినందున 25శాతం రిబేట్ కింద మరికొంత మొత్తం మినహాయించి మొత్తంగా రూ. 3,27,74,892 చెల్లించాలని డిమాండ్ వచ్చింది. దీంతో కంగుతిన్న వినియోగదారుడు అధికారులను సంప్రదించగా ఆన్‌లైన్‌లో చూపించిన దానికి తాము బాధ్యులు కాదని సదరు మొత్తం ఫీజు చెల్లిస్తేనే రిజిస్ర్టేషన్ చేస్తామని తెలుపడంతో వినియోగదారు డు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరో కేసు లోను ఇలాంటి ఘటన ఎదురైంది. రామకృష్ణాపూర్ కు చెందిన ఓ వినియోగదారుడు తన 240 గజాల స్థలాన్ని రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు మంచిర్యాల స బ్ రిజిస్ర్టార్ కార్యాలయం దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి అన్ని చార్జీలతో సహా రూ.2,39,77,127 ఫీజు చెల్లించాలని రావడంతో అవాక్కయ్యాడు. ఈ విష యంలోను అధికారులు చేసేదేమిలేక చేతులెత్తేశా రు. ఇలా వినియోగదారులకు సబ్ రిజిస్ర్టార్ కార్యాల యంలో వింత ఘటనలు ఎదురవుతుండడంతో ఆం దోళనకు గురవుతున్నారు.
జోరుగా దళారుల దందా...
మంచిర్యాల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో సాం కేతిక లోపాలు నెలకొనడం ఒక్కెత్తు అయితే దళారు ల బెడద వినియోగదారులను మరింతగా వేధిస్తోం ది. ఇటీవల మంచిర్యాలలోని గర్మిళ్ల శివారులో 11 గుంటల స్థలాన్ని తన అవసరం నిమిత్తం భూమి యజమాని అమ్ముకున్నాడు. స్థలానికి ఎల్‌ఆర్‌ఎస్ రుసుం కూడ చెల్లించారు. రిజిస్ర్టేషన్ చేయడానికి ప్రభుత్వానికి చెల్లించే రుసుంతోపాటు అదనంగా అ ధికారులకు రూ. 80వేలు ఇవ్వాలని డాక్యుమెంట్ రై టర్ కొనుగోలు దారుని నుంచి వసూలు చేశారు. రిజిస్ర్టేషన్ ప్రక్రియ కూడ పూర్తయింది. సబ్ రిజి స్ర్టార్ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగికి పై డ బ్బులు ఇచ్చేందుకు వసూలు చేస్తున్నట్లు తెలు స్తుం ది. ఈ విషయం బయటకు పొక్కడంతో అప్రమత్త మైన సదరు దస్తావేజులేఖరి అదనంగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేందుకు వినియోగదారుడితో కాళ్లబేరానికి వచ్చినట్టు తెలిసింది. అధికారులకు న గదు వసూలు చేసిన విషయమై సమాచారం ఉం దా... లేదా అన్న విషయం పక్కన పెడితే ఒక్కో విని యోగదారుడి వద్ద అంత మొత్తం వసూలు చేయ డం స్థానికంగా కలకలం రేపుతోంది. వసూలు చేసిన మొత్తంలో నుంచి కొంత మొత్తం వినియోగదారుడి కి ఇప్పటికే చెల్లించగా మిగితాది త్వరలో ఇవ్వనున్న ట్లు తెలిసింది.
వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం వల్లే...
మంచిర్యాల సబ్ రిజిస్ర్టార్ ప్రియాంక
వెబ్‌సైట్‌లో అధిక రుసుం చూపించడం కేవలం సాంకేతిక సమస్య వల్లనే అని జరిగింది. ఈ విషయ మై పై అధికారులకు సమాచారం అందించాం. దళా రుల విషయంలో కార్యాలయానికి ఎలాంటి సంబం ధం లేదు వినియోగదారులు ఎవరు కూడ దళారు లను ఆశ్రయించి నష్టపోవద్దు. నేరుగా అధికారులను సంప్రదించి పని పూర్తి చేసుకోవాలి

హెచ్సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు..

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి పేరు ఖరారు

ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు

పనిచేసేది హోంగార్డుగా.. గ్రూపు-4లో ఉద్యోగం ఇప్పిస్తానని..

నవమి శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో బందోబస్తు
