Leopard: ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన చిరుత.. చివరికి ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jan 31 , 2025 | 08:03 AM
మెదక్ జిల్లా వల్లూరు కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు చిరుత ప్రయత్నించింది. అయితే వేగంగా వెళ్తున్న ఓ వాహనం చిరుతను బలంగా ఢీకొట్టంది. ఈ ఘటనలో చిరుత తీవ్రంగా గాయపడింది. అనంతరం రోడ్డుపక్కకు వెళ్లిపోయింది.

మెదక్: గుర్తుతెలియని వాహనాలు ఢీకొని చిరుత(Leopard) మృతిచెందిన ఘటన మెదక్ (Medak) జిల్లా నార్సింగి మండలం వల్లూరు అటవీప్రాంతం (Valluru forest area)లో చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజాము సమయంలో వల్లూరు కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు చిరుత ప్రయత్నించింది. అయితే వేగంగా వెళ్తున్న ఓ వాహనం చిరుతను బలంగా ఢీకొట్టంది.
ఈ ఘటనలో చిరుత తీవ్రంగా గాయపడింది. అనంతరం రోడ్డుపక్కకు వెళ్లిపోయింది. కాసేపటికి తేరుకున్న చిరుత అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేసేందుకు మళ్లీ రోడ్డుపైకి వచ్చింది. అయితే చిరుత దాడి నుంచి సదరు వ్యక్తి తప్పించుకున్నాడు. అదే సమయంలో భారీ వాహనం ఢీకొట్టడంతో అది ఎగిరి రోడ్డుపక్కన పడిపోయింది. వాహనం బలంగా ఢీకొట్టడంతో దాని పొట్టపగిలి పేగులు బయటకు వచ్చాయి. దీంతో గిలగిలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
వాహనదారుల సమాచారం మేరకు స్థానిక ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి, డీఎఫ్ వో జోజి, రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారులు అక్కడికి చేరుకుని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత వయసు రెండున్నరేళ్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమల శిలాతోరణం సర్కిల్‌లోని ఓ కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గురువారం సాయంత్రం కొండపై చిరుత కూర్చుని ఉండటాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. వెంటనే దాన్ని తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకుని టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాహనదారులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Kukatpally: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు వివరాలివే..
CM Revanth Reddy: నయా ఉస్మానియాకు నేడు సీఎం శంకుస్థాపన