సోయి లేకుండా మాట్లాడుతున్న సీఎం
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:55 AM
ముఖ్యమంత్రిననే సోయి లేకుండా రేవంతరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, ఆయన భాష తీరే ఆయన్ను రాజకీయంగా బొందపెడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లు: మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి
సూర్యాపేటరూరల్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రిననే సోయి లేకుండా రేవంతరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, ఆయన భాష తీరే ఆయన్ను రాజకీయంగా బొందపెడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి మండిపడ్డారు. హుజుర్‌నగర్ సభలో రేవంతరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోమవారం గాంధీనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. రేవంతరెడ్డి భాషలో ఎలాంటి మార్పులేదని, హుజుర్‌నగర్ సభలో అదే మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని ప్రదర్శించారన్నారు. సోనియాను, ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. కేసీఆర్‌పై విషం కక్కి ప్రజాక్షేత్రంలో బతకడం సాధ్యంకాదన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పినా సీఎం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని, పొలాల వద్ద రైతులు కన్నీరు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాకాకాలంలో ఎంత ధాన్యం కొన్నారు, ఎంత బోనస్ ఇచ్చారని అడిగితే ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నాయకులు నిమ్మల శ్రీనివా్‌సగౌడ్, వై వెంకటేశ్వర్లు, షేక్ రఫీ, మారిపెద్ది శ్రీనివా్‌సగౌడ్, శ్రీనివా్‌సరెడ్డి, పాల్గొన్నారు.