Share News

గురుకులాల్లో కోడింగ్‌ క్లాసులు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:48 AM

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకులాల్లో ఇక నుంచి సాంకేతిక విద్య కూడా అందించనున్నారు. మెరుగై న విద్యతో పాటు పోటీ ప్రపంచంలో సాంకేతికతలో వస్తున్న మార్పులు అందించాలనే తలంపుతో టీజీఎ్‌సడబ్ల్యుఆర్‌ఇఐఎ్‌స(తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సొసైటీ) కోడింగ్‌ క్లాసులకు సిద్ధమైంది.

గురుకులాల్లో కోడింగ్‌ క్లాసులు

6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు శిక్షణా తరగతులు

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు

ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, రోబొటిక్స్‌, ఆన్‌లైన్‌ టూల్స్‌పై క్లాసులు

(ఆంధ్రజ్యోతి-కోదాడ) : కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకులాల్లో ఇక నుంచి సాంకేతిక విద్య కూడా అందించనున్నారు. మెరుగై న విద్యతో పాటు పోటీ ప్రపంచంలో సాంకేతికతలో వస్తున్న మార్పులు అందించాలనే తలంపుతో టీజీఎ్‌సడబ్ల్యుఆర్‌ఇఐఎ్‌స(తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సొసైటీ) కోడింగ్‌ క్లాసులకు సిద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం(2025- 26) నుంచే అందించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు తగ్గట్లు సౌకర్యాలు కల్పించనున్నట్లు గురుకుల ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు రెగ్యులర్‌ తరగతులతో పాటు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఫలితంగా విద్యార్థులు సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుంటూ ఆయా రంగాల్లో రాణిస్తారని భావిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 17,920 మంది విద్యార్థులు కోడింగ్‌ క్లాస్‌లను సద్వినియోగం చేసుకోనున్నారు. ప్రాథమికోన్నత స్థాయి నుంచి విద్యార్థులకు కోడింగ్‌ క్లాసులు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఉమ్మడి జిల్లాలో 28 గురుకులాలు..

ఐదవ జోన్‌లోని ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు జనగాం జిల్లాలోని 28ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున 17,920మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం కోడింగ్‌ క్లాసులు అందించాలనే నిర్ణయంతో వారందరూ సాంకేతిక విద్యను అందిపుచ్చుకోనున్నారు.

కోడింగ్‌ అర్థం..

కంప్యూటర్‌గానీ,స్మార్ట్‌ఫోన్‌గానీ వాడుతున్నప్పుడు మనకు తెరపై కనిపించే అప్లికేష న్లు నడిపించేందుకు వెనక చాలా ప్రోగ్రామ్‌లు పనిచేస్తుంటాయి. ఆయా ప్రోగ్రామ్‌లను కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ భాషలో రాస్తారు.ఇలా రాయడాన్ని కోడింగ్‌అంటారు.ఈ కోడిం గ్‌ ద్వారానే అప్లికేషన్లు, వెబ్‌సైట్లు, సాఫ్ట్‌వేర్‌ రూపొందివచ్చు. పైథాన్‌,జావా, హెచ్‌టీఎంఎల్‌వంటి కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లు ఈకోవకు చెందినవేనని నిపుణులు చెబుతున్నారు.

పాఠ్యాంశాలతో పాటు శిక్షణ ..

పోటీ ప్రపంచంలో చదువుతో పాటు నైపుణ్యాభివృద్థి(స్కిల్‌ డెవల్‌పమెంట్‌) అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. కాగా ప్రభుత్వం ప్రస్తుతం తరగతి గదిలో కరిక్యులమ్‌(పాఠ్యప్రణాళిక), యాక్షన్‌ప్లాన్‌(కార్యాచరణ ప్రణాళిక), మానిటరింగ్‌(పర్యవేక్షణ), పెడగోజీ(బోధన)నను ప్రభుత్వం అందిస్తోంది. దీంతో రోజురోజుకూ సాంకేతికతలో వస్తున్న మార్పులను అందుకోవాలంటే చదువుతో పాటు కంప్యూటర్‌ నైపుణ్యం, కోడింగ్‌, ఏఐలో శిక్షణ అవసరమని ప్రభుత్వ గుర్తించింది. దీంతో విద్యార్థులకు కృత్రిమ మేథ(ఏఐ), రోబొటిక్స్‌, ఆన్‌లైన్‌ టూల్స్‌తో పాటు, కోడింగ్‌లో శిక్షణకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు.

శిక్షణ ఇలా

విద్యార్థులు రోజుకు రెండు గంటల పాటు కోడింగ్‌పై తరగతులు నిర్వహించి, అనంతరం ప్రాజెక్టు తరగతులు నిర్వహిస్తారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కోడింగ్‌కు తరగతుల బోధనను, శిక్షణ పొందిన కోడింగ్‌ మెంటర్స్‌ చేస్తారని పేర్కొంటున్నారు. శిక్షణకు పాఠశాలలో అత్యాధునిక కంప్యూటర్‌ ల్యాబొరేటరీలు వస్తుండటంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ఎంతో సహాయపడతాయంటున్నారు. ఇదిలా ఉంటే కోడింగ్‌ శిక్షణకు సంబంధించి సర్టిఫికెట్‌ అందుకుంటారని వారంటున్నారు.

సాంకేతిక మెళకువలు నేర్పటం అభినందనీయం : దున్నా వెంకటేశ్వర్లు,గురుకుల ఉపాధ్యాయుడు

ఆరో తరగతి నుంచే విద్యార్థులకుసాంకేతిక మెళకువలు నేర్పించాలనే ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. సాధారణంగా గురుకులాల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉంటారు. వారికి ఫోన్లు, కంప్యూటర్‌పై అవగాహన ఉండదు. ప్రభుత్వ నిర్ణయంతో పాఠశాలలోనే సాంకేతికతపై అవగాహన సంపాదించి బయటకు వెళ్తా రు. విద్యార్థులు ఏరంగంలో రాణించాలన్నా ఇప్పడు స్కిల్‌డెవల్‌పమెంట్‌ ప్రధానంగా అ వసరం.అది పాఠశాల స్థాయిలోనే సాధిస్తారు. దీంతో పోటీప్రపంచలో సులభంగా రాణిస్తారు.

Updated Date - Apr 10 , 2025 | 12:48 AM