Share News

సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:56 AM

ప్రతి ఒక్కరూ సైబర్‌ నేరాల నిర్మూలనపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

ఎస్పీ కొత్తపల్లి నర్సింహ

సూర్యాపేట క్రైం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరూ సైబర్‌ నేరాల నిర్మూలనపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడం, ఉచిత బహుమతులు రావడం, మన ప్రమేయం లేకుండా ఏదైనా వస్తుందంటే దాని వెనుక సైబర్‌ మోసగాళ్లు ఉన్నారని గ్రహించాలన్నారు. అప్రమత్తత, అవగాహన ద్వారా సైబర్‌ నేరాలను అరికట్టవచ్చన్నారు. ఏదైనా అనుమానం వస్తే ట్రోల్‌ ఫీ నెంబర్‌ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. బ్యాంకింగ్‌ ఉద్యోగులమంటూ ఖాతాదారులకు ఫోన చేసి వ్యక్తిగత వివరాలు, ఏటీఎం, ఫిన, ఓటీపీలు వంటి వివరాలు అడిగితే వెంటనే సైబర్‌ క్రైంకు ఫోన చేయాలన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 12:56 AM