ఫోనఇనతో సమస్యలకు పరిష్కారం
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:20 AM
యాదగిరిగుట్ట పట్టణంలో పలు సమస్యల పరిష్కారానికి అధికారులు, నిసిపల్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

నడుంబిగించిన అధికారులు
‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నంపై స్థానికుల హర్షం
(ఆంధ్రజ్యోతి,యాదగిరిగుట్ట రూరల్)
యాదగిరిగుట్ట పట్టణంలో పలు సమస్యల పరిష్కారానికి అధికారులు, నిసిపల్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ుునిసిపాలిటీ పరిధిలోని స్థానిక సమస్యలపై జనవరి 6న ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో స్థానికులు తెలిపిన సమస్యల పరిష్కారానికి అధికారులు నడింభిగించారు. యాదగిరిగుట్ట పట్టణంలో మెయిన్‌రోడ్డుపై తరచూ ప్రమాదాలు ట్రాఫిక్ సమస్యలకు కారణమైన ప్లెక్సీలను తొలగించారు. గాంధీనగర్‌లో అక్రమంగా వేసిన పానిపురి డబ్బాలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు కాకుండ చర్యలు తీసుకున్నారు. గణే్‌షనగర్‌లో పాతగుట్ట కమాన్ పక్కన గల్లీనుంచి వెళ్లే దారికి అడ్డంగా ఉన్న మ్యాన్‌హోల్‌ను తొలగించి వాహనాలు నేరు గా వెళ్లే విధంగా చదును చేశారు. ఆ ప్రాం త వాహనదారులకు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద సమస్య తొలగిపోయింది. పాతగుట్టకు వెళ్లే దారిలో కోళ్ల దుకాణాల యజమానులు కోళ్లద్వార వచ్చే మురికినీరు రోడ్డపైకి రాకుండ దానిని నివారించి ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా బ్లీచింగ్ పౌండర్‌వేసి శుభ్రం చేస్తున్నారు.
12వ వార్డులో కొంతకాలంగా వాటర్ పైపు లు లీకేజ్ కావడంతో నీరు రోడ్లపై, కాలనీలో విస్తరించి బురదమయంగా మారకుండ వాటికి మరమ్మతులు చేశారు. ఇళ్ల మధ్య చెత్తను వేయకుండా అందరూ చెత్తవాహనంలో వేయాలని ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక ప్రజలు చెత్త వాహనం లో చెత్తను వేస్తున్నారు. నల్లచెరువు వదరతో పంటపోలాలకు వదరనీరు వెళ్లకుండా కాలువలో పూడికతీసి పంటలకు నష్టం జరుగకుండా నివారించారు. ప్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో వరుసగా ఫాగింగ్ చేసి దోమలను నివారించారు. పాతగుట్ట, గాంధీనగర్ రోడ్డుపైన గుంతలుపడి ప్రయాణం చేయడానికి ఇబ్బందికరం గా మారడంతో రోడ్డుపై తాత్కాలికంగా మట్టితో గుంతలను పూడ్చివేసి మరమ్మతు లు చేశారు. అంగడి బజారు వద్ద మురికి కాలువ పక్కన ప్రమాదం పొంచి ఉన్న పెద్దగుంట పై సీసీరోడ్డు వేసి ప్రమాదం జరుగకుండ చర్యలుకున్నారు. పట్టణంలో ఫోన్‌ఇన్ సమస్యలను దాదాపు సగం వరకు పూర్తిచేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ప్రమాదాలను నివారించారు
కొన్ని సంవత్సరములుగా తమ గల్లీదారికి అడ్డంగా ఉన్న మ్యాన్‌హోళ్లను తొలగించడంతో పెద్ద సమస్య పరిష్కారం అయ్యింది. ప్రమాదాలు జరుగకుండా వాహనాలు నేరుగా వెళ్లే విధంగా చేయడం ఆనందంగా ఉంది.
-రాయగిరి జగదీ్‌షగౌడ్, 12వ వార్డు
చెత్త నివారణ చర్యలు అభినందనీయం
కొన్ని రోజులుగా 9వ వార్డులో ఇళ్ల్ల మధ్య ప్రతీ రోజు చుట్టుపక్కల ఇళ్ల కు చెందిన ప్రజలు వేసిన చెత్తను దహనం చేయకుండా అధికారులు దానిని నివారించారు. చెత్తను వాహనంలో వేసే విధంగా ఆదేశాలు జారీచేసి అవగాహన కల్పించారు. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం.
-గోర్ల జ్యోతి, 9 వార్డు
సమస్యలను మా దృష్టికి తీసుకురావడం సంతోషించదగ్గ విషయం
‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహించి మునిసిపల్ పరిధిలోని సమస్యలను మా దృష్టికి తీసుకవచ్చి వాటిని పరిష్కరించడానికి పూర్తిగా సహకరించడం సంతోషించదగ్గ విష యం. పట్టణ పరిధిలో సుమారు 19 సమస్యలపై ఫిర్యాదు చేస్తే వాటిలో 12వరకు పరిష్కరించాం.
- అజయ్‌కుమార్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్