ముస్లింల హక్కులను కాలరాస్తున్న ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:45 PM
ముస్లింల హక్కులను కాలరాస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కార్యదర్శి ఎం.బాల్‌నర్సిం హ డిమాండ్ చేశారు.

- వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ
నాగర్‌కర్నూల్‌టౌన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : ముస్లింల హక్కులను కాలరాస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కార్యదర్శి ఎం.బాల్‌నర్సిం హ డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వ హించి అక్కడ ఆందోళన చేపట్టారు. ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.బాల్‌న ర్సింహతో పాటు రాష్ట్ర సమితి సభ్యుడు హెచ్.ఆనంద్‌జీ, ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ పాల్గొ ని ధర్నానుద్దేశించి ప్ర సంగించారు. దేశంలో పెట్రోలు, డీజిల్, నిత్యా వసర ధరల పెరుగుదల, పేదరికం, ఆకలి చావులు, మతోన్మాదం పెరిగిపో తుంటే వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు మోదీ ప్ర భుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తెచ్చిం దని విమర్శించారు. కార్యక్రమం లో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కేశవు లుగౌడ్, డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మీపతి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మారేడు శివశంకర్, సీపీఐ జిల్లా నాయకులు కృష్ణాజీ, అరవింద్, బొల్లెద్దుల శ్రీనివాసులు, బాలమురళి, బిజ్జ శ్రీనివాసులు, ఇన్సాఫ్ నాయకులు ఎండీ. యూసూఫ్, శివకృష్ణ, మధుగౌడ్, కొత్త రామ స్వామి, ఎండీ.ఖాజా, కొత్త రామస్వామి, వక్ఫ్ బోర్డు సభ్యులు నిజాం, ఖాజాబాబా, రఫీక్, ఇబ్ర హీం, మోసిన్, ఖాజా, ఎండీ.అలీ ఫరీద్, సహబ్ యాకుబ్, ముస్తాక్, అలీమ్ పాల్గొన్నారు.