యాంత్రీకరణకు సిద్ధం
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:53 AM
ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొ చ్చి రైతులకు ఊతమిచ్చేందుకు యాంత్రీకరణ పథకాన్ని ఎట్టకేలకు మళ్లీ అమలుకు శ్రీకారం చుట్టింది.

యాంత్రీకరణకు సిద్ధం
మహిళా రైతులకు యంత్ర పరికరాలు
మునుగోడుకు రూ. 22.42 లక్షల నిధులు
మునుగోడు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొ చ్చి రైతులకు ఊతమిచ్చేందుకు యాంత్రీకరణ పథకాన్ని ఎట్టకేలకు మళ్లీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ దఫా మహిళా రైతుల పేర్ల మీద వర్తింపజేసేందుకు ప్రాధాన్యత కల్పిస్తూ ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత ప్రభుత్వం హయాం లో ఆరేళ్లుగా నిలిచిపోయిన పథకంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని పునరుద్ధరణ చేయటంతో రైతులకు కొంత ఊరట లభించిందని పలువురు పేర్కొంటున్నారు. ఈ మేరకు పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిధులు మంజూరు
వ్యవసాయ యాంత్రీకరణ ఉప ప్రణాళిక పథకం (ఎస్‌ఎంఏఎం) అమలుకోసం 2024- 25 ఆర్థిక సంవత్సరానికి ము నుగోడు నియోజకవర్గానికి రూ.22.42 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఇందులో కేంద్రప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం వాటాగా నిధులు అందించనున్నాయి. ఈ పథకానికి కేవలం మహిళా రైతులే అర్హులు. 50 శాతం రాయితీపై వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు, యంత్ర పరికరాలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తూ అందుకు అవసరమైన నిబంధనలు వెలువరించింది. 2016- 17 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వ్య వసాయశాఖలో యాంత్రీకరణ పథకాన్ని నిలిపివేసిం ది. దీంతో వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయలేక రైతులు వివిధరకాలుగా ఇబ్బందులకు గురయ్యా రు. రైతులతో పాటు రైతు సంఘాలు నిలిపేసిన యంత్రలక్ష్మి పథకాన్ని పునరుద్ధరించాలని పలుమా ర్లు విన్నవించటంతో ప్రభుత్వం స్పందించింది. యాం త్రీకరణ పథకంలో వ్యవసాయ పనిముట్లు, పరికరాలకు అవసరమైన నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దరఖాస్తు ప్రక్రియ..
ఈ నెల 25వ తేదీ నుంచి మహిళా రైతుల నుంచి ఆనలైన దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన మహిళా రైతుకు సంబంధించిన ఫొటో, ఆధార్, పట్టాపాసు పుస్తకంతో పాటు ట్రాక్టర్ రిజిస్ట్రేషన పత్రాలు జత చేసి వ్యవసాయ కార్యాలయాల్లో వ్యవసాయాధికారి, విస్తరణ అధికారులకు దరఖాస్తులను అందజేయాలి. అధికారులు పరిశీలించి న అనంతరం ఆ నలైనలో దరఖా స్తు చేస్తారు. మొత్తం 11 రకాల యాంత్రీకరణ పరికరాలు కలిపి 122 యూనిట్లు మంజూరయ్యాయి.
యాంత్రీకరణతో రైతులకు ఉపయోగం
మారుతున్న కాలంలో సాగు విధానాలు మార్పు చేయటం ద్వారా పంటలు అధిక దిగుబడులతో లాభాలు గడించవచ్చు. అందుకు అనువుగా ముందుకు సాగాలి. సాగులో కూలీల ప్రభావం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం రైతులుకు ఎంతగానో దోహదపడుతోంది. ప్రధానంగా పేద రైతులు ఈ పథకం వల్ల లబ్ధి పొందనునున్నారు. అర్హులైన మహిళా రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి.
బి. వేణుగోపాల్ ఏడీఏ, మునుగోడు