CM Revanth Reddy: అత్యంత శక్తిమంతమైన భారతీయుల జాబితాలో రేవంత్‌రెడ్డి @ 28
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:45 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశంలోని అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఏకంగా 11 స్థానాలు ఎగబాకారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జాబితా-2025లో నిరుటితో పోలిస్తే 11 స్థానాలు పైకి చేరుకున్న ముఖ్యమంత్రి
విధానపరమైన కీలక నిర్ణయాలతోనే గుర్తింపు!
అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ.. 9వ స్థానంలో రాహుల్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు 14వ స్థానం
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశంలోని అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఏకంగా 11 స్థానాలు ఎగబాకారు. దేశంలోని వివిధ రంగాల్లో అత్యంత శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్-2025’ జాబితాను విడుదల చేసింది. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డికి 28వ స్థానం దక్కింది. గత ఏడాది ఈ జాబితాలో ఆయన 39వ స్థానంలో నిలిచారు. జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. నిరుడూ ఆయన నంబర్ వన్‌గానే ఉన్నారు. రెండో స్థానంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మూడో స్థానంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నిలిచారు. తర్వాత (పది స్థానాల్లో) వరసగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఉన్నారు. 100 మంది జాబితాలో దేశంలోని రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నా రు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పాటైన తర్వాత పాలనలో తీసుకొచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలతో సీఎం రేవంత్‌రెడ్డికి ఈ గుర్తింపు లభించింది. తనదైన దూకుడుతో దేశ రాజకీయాల్లో చూపుతున్న ప్రభావం, నాయకత్వ లక్షణాల తో ఆయన ర్యాంకు ఈ సారి బాగా మెరుగుపడింది. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యాలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్‌ను కీలక నాయకునిగా నిలిపేలా చేశాయి. ఇక ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు 14 స్థానంలో నిలిచారు. ఆయనకు ఈ ఏడాది కొత్తగా జాబితాలో చోటు దక్కడం గమనార్హం. ఈ సారి సినీ నటుడు అల్లు అర్జున్‌కూ చోటు దక్కింది. ఆయన 92వ స్థానంలో నిలిచారు.
విధానపరమైన నిర్ణయాలతో..
రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేయడం, ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వడం, మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రో ల్ బంకులు, ప్రీమియం రిటైల్ స్టోర్ల వంటి వ్యాపార అవకాశాలను కల్పించడం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకం వంటి అనేక నిర్ణయాలు రేవంత్‌రెడ్డికి ఆదరణ పెరగడానికి కారణమయ్యాయి. కాగా, పారదర్శకమైన పాలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడినందునే అత్యంత శక్తిమంతుల జాబితా-2025లో సీఎం రేవంత్ 28వ స్థానంలో నిలిచారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. ఈ గుర్తింపు తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి బాధ్యతను మరింత పెంచినట్లయిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News