Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియపై కఠిన చర్యలు వద్దు
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:03 AM
బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశారంటూ దాఖలైన కేసుల్లో యాంకర్ విష్ణుప్రియకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోకూడదని పోలీసులను ఆదేశించింది.

ముందుగా నోటీసులు ఇవ్వండి: హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశారంటూ దాఖలైన కేసుల్లో యాంకర్ విష్ణుప్రియకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోకూడదని పోలీసులను ఆదేశించింది. ముందుగా బీఎన్‌ఎ్‌సఎస్ 35 (సీఆర్‌పీసీ 41ఏ) కింద నోటీసులు జారీ చేసి చట్టప్రకారం విచారణ చేపట్టాలని సూచించింది.
ఆమెపై వినయ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఒక కేసు, ఫణీంద్రశర్మ చేసిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించింది.