కామ్రాకు ముందస్తు బెయిల్
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:05 AM
కమెడియన్ కునాల్ కామ్రా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాధ్ షిండేపై చేసిన వ్యాఖ్యలతో చట్టపరమైన వివాదంలో చిక్కుకున్నారు. అరెస్ట్ నుంచి రక్షణ కోసం మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

చెన్నై, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాధ్ షిండేను ‘ద్రోహి’గా అభివర్ణిస్తూ విమర్శించిన వ్యవహారంలో ఆర్టిస్ట్ కునాల్‌కామ్రాకు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. కునాల్‌కామ్రా మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో శిందేను ఉద్దేశించి విమర్శలు చేశారు. దీంతో, శిందే అభిమానులు మహారాష్ట్రలోని ముంబై ఘర్ పోలీస్ స్టేషన్‌లో కునాల్‌పై ఫిర్యాదు చేశారు. కామ్రా ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్న నేపథ్యంలో, మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిలు కోరుతూ శుక్రవారం పిటిషన్ దాఖలుచేశారు. ఆయన విల్లుపురం జిల్లాకు చెందిన వారు కావడంతో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..