Share News

బ్యాంకాక్‌లో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ కుటుంబం

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:47 AM

రామగుండం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ కుటుంబానికి బ్యాంకాక్‌లో ప్రాణాపాయం తప్పింది. అక్కడ చోటుచేసుకున్న భూకంపం నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారు.

బ్యాంకాక్‌లో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ కుటుంబం

ఇద్దరు కుమారులు, కోడలితో పర్యటనకు వెళ్లిన ఆయన సతీమణి

భూకంపంతో దెబ్బతిన్న వారి హోటల్‌

అప్రమత్తమై హుటాహుటిన ఎయిర్‌పోర్టుకు..

హైదరాబాద్‌/కోల్‌సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రామగుండం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ కుటుంబానికి బ్యాంకాక్‌లో ప్రాణాపాయం తప్పింది. అక్కడ చోటుచేసుకున్న భూకంపం నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజ్‌ఠాకూర్‌ హైదరాబాద్‌లోనే ఉండగా.. ఆయన సతీమణి మనాలీ ఠాకూర్‌, పెద్ద కుమారుడు ప్రతీక్‌, ఆయన భార్య, చిన్న కుమారుడు నితీశ్‌ గురువారం బ్యాంకాక్‌ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం అక్కడ సంభవించిన భూకంపం తాకిడికి వారు విడిది చేసిన హోటల్‌ దెబ్బతిన్నది. సమీపంలోని చాలా భవనాలు కూలిపోయాయి. రాజ్‌ఠాకూర్‌ సతీమణి మనాలీ ఠాకూర్‌ అప్రమత్తంగా వ్యవహరించి కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చారు. వారంతా హుటాహుటినా బ్యాంకాక్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా, తమ కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని, వారు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ వెల్లడించారు.

Updated Date - Mar 29 , 2025 | 05:58 AM