Mahesh Kumar Goud: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చరిత్రాత్మకం
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:48 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్పీ మహేశ్‌కుమార్ గౌడ్ అభివర్ణించారు.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు: మహేశ్
‘ప్రైవేటు’లోనూ రిజర్వేషన్ : కూనంనేని
నూతన అధ్యాయం: బీసీ కమిషన్ చైర్మన్
హైదరాబాద్, మార్చి17 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్పీ మహేశ్‌కుమార్ గౌడ్ అభివర్ణించారు. మండలి మీడియా పాయింట్‌లో మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బీసీలకు మద్దతుగా కాంగ్రెస్ ఉందని చెప్పడానికి రిజర్వేషన్ల పెంపే నిదర్శనమని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను విజయవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ సంద్భంగా ఆయన మాట్లాడారు.
దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వమే కులగణన సర్వే చేసిందని చెప్పారు. సర్వే వవివరాల ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం సంతోషకరమన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడంపై తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలకనుందని పేర్కొన్నారు. అభివర్ణించారు. బీసీ బిల్లు ఆమోదం తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ పేర్కొన్నారు.