సన్న బియ్యం పంపిణీ ఘనత రేవంత్‌రెడ్డిదే...
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:26 PM
దేశంలో మొట్టమొదట సారిగా సన్న బియ్యం పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించిన ఘనత ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డిదే అని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): దేశంలో మొట్టమొదట సారిగా సన్న బియ్యం పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించిన ఘనత ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డిదే అని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం పట్టణంలోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పథకాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఏరాష్ట్రంలో ఏ ప్ర భుత్వం అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుం బాలకు సన్న బియ్యం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం మెనిఫెస్టోలో లేని పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారని తెలి పారు. గత ప్రభుత్వాలు పేదల అభివృద్ధికి కృషి చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరిక్రిష్ణ, నాయకులు కారుకూరి రాంచందర్, బత్తుల రవి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్వేత, మాజీ కౌన్సిలర్ రాజలింగు పాల్గొన్నారు.
చెన్నూరు : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి సూచనల మేరకు మండలంలోని అక్కెపల్లి, చింతలపల్లి గ్రామాల్లో సన్నబి య్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చల్ల రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మోహన్‌రెడ్డి, సుశీల్‌కు మార్, శ్రీనివాస్, భద్రచారి, రమే ష్ పాల్గొన్నారు.
తాండూర్ : మండలంలోని అచ్చలాపూర్ గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం మండల తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో శ్రీనివాస్, సీఐ కుమారస్వామిలు ప్రారంభించారు. పంచా యతీ కార్యదర్శి కల్పన, కాంగ్రెస్ నాయకులు పోశం, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్ : మండలంలోని చిర్రకుంట గ్రామంలో గు రువారం రేషన్ షాపులో తహసీల్దార్ సతీష్‌కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్‌లు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. అందుగుల పేట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కడారి జీవన్‌కు మార్ సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు గందె రాంచందర్, మాజీ సర్పంచు ఒడ్నాల కొమురయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.