అడుగంటుతున్న గొల్లవాగు...
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:20 PM
భీమారం మండలం పూర్తిగా వ్యవసాయ ఆధారిత మండలం. 80 శాతం మంది రైతులు వరి పంటను పండిస్తు న్నారు. 20 శాతం మంది రైతులు పత్తి పంటను సా గు చేస్తున్నారు. ఎండలు తీవ్రత పెరగడంతో భీమా రం మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్టులోని నీ రు రోజు రోజుకూ అడుగంటిపోతోంది.

-ప్రాజెక్టు నీటి సామర్థ్యం 0.5 టీఎంసీలు...
-ప్రస్తుతం తగ్గిన నీటి మట్టం
-ఆందోళనలో రైతులు
భీమారం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : భీమారం మండలం పూర్తిగా వ్యవసాయ ఆధారిత మండలం. 80 శాతం మంది రైతులు వరి పంటను పండిస్తు న్నారు. 20 శాతం మంది రైతులు పత్తి పంటను సా గు చేస్తున్నారు. ఎండలు తీవ్రత పెరగడంతో భీమా రం మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్టులోని నీ రు రోజు రోజుకూ అడుగంటిపోతోంది. రైతుల పం ట పొలాలు పొట్ట దశకు చేరుకున్నాయి. ఇంకా 45 రోజులు నీరు పంట పొలాలకు అందితే కానీ పంట లు చేతికి వచ్చే పరిస్థితి లేదు. గొల్ల వాగు ప్రాజెక్టు ను 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 83 కో ట్లతో నిర్మించింది. ప్రాజెక్టు నీటి సామర్ధ్య విస్తీర్ణం వె య్యి ఎకరాలు కేటాయించగా ప్రాజెక్టుకు ప్రధాన కా లువతో పాటు 39 డిస్ర్టిబ్యూటరీ కాలువలు ఉన్నా యి. ప్రధాన కాలువ పూర్తి పొడవు 26 కిలోమీటర్లు ఉంటుంది. భీమారం మండలంతో పాటు చెన్నూరు మండలంలోని గంగారాం, ఓత్కులపల్లి, ఆస్నాద, అం గ్రాజ్‌పల్లి, దుగ్నేపల్లి, చెల్లయ్యపేట, రాజిపేట, కొమ్మె ర ఎర్రగుంటపల్లి తదితర గ్రామాలకు నీటిని అందిం చాలని ప్రాజెక్టును నిర్మించారు. వర్షాకాలంలో ఆయ కట్టు మొత్తం విస్తీర్ణం 9,500 ఎకరాలు కాగా వేసవి కాలంలో 7 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరంది స్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టుకు కూ తవేటు దూరంలో ఉన్న భీమారం శివారులోని రైతు లు పూర్తిగా ప్రాజెక్టు మీదనే ఆధారపడి పంటలను సాగు చేస్తుంటారు. ఈ సంవత్సరం ఇంకా 45 రోజు లు నీరందితే తప్ప పంటలు చేతికొచ్చే అవకాశాలు కానరావడం లేదు.
-ప్రాజెక్టులో తగ్గుతున్న నీరు
గత సంవత్సరం తక్కువ వర్షాల కారణంగా అ లాగే పైన ఉన్న గొల్లవాగుకు ఖాజీపల్లి గ్రామంలో పెద్దవాగు ప్రాజెక్టు నిర్మించడంతో నీరంతా అక్కడే నిలవడంతో వచ్చే కొద్ది నీరు గొల్లవాగు ప్రాజెక్టులో చేరింది. గొల్లవాగు ప్రాజెక్టు భీమారం మండలం నుంచి చెన్నూరు మండలం వరకు రైతుల పొలాల కు నీరందిస్తుంది. చెన్నూరు మండలం, భీమారం మండలంలోని కొత్తపల్లి, మద్దికల్, ఎల్కేశ్వరం గ్రా మాల్లో పంటలు ప్రస్తుతం పాలు పోసుకునే దశలో ఉంది. భీమారం రైతులు పూర్తిగా గొల్లవాగు ప్రాజెక్టు మీద ఆధారపడి ఉండడంతో ప్రాజెక్టు నీరును జన వరిలో వదలగా ఫిబ్రవరి చివరి నాటికి రైతులు నా ట్లు పెట్టుకున్నారు. వరి పంట పొట్ట దశలో ఉండగా ప్రాజెక్టు నీరు అడుగంటి పోతుండటం ఇబ్బందికరంగా మారింది. ఇంకా 45 రోజులు నీరు వస్తేనే పంట చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ రోజు రోజు కూ ఎండల తీవ్రత పెరుగుతుండ డం నీటి మట్టం తగ్గుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. ప్రాజెక్టులో నీరు తగ్గిపోయి తూము దిమ్మెలు బయటకు కనిపిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. గొల్లవాగు ప్రాజెక్టు నీటి మట్టం 0.5 టీఎంసీలు కానీ ప్రాజెక్టు ముందు భాగంలో నీ రు పూర్తిస్థాయిలో నిలవడం లేదు. దీంతో నీరు ఎక్కువ మొత్తం నిలువకపోవడం రైతులకు శాపం గా మారింది. ఇప్పటికైనా అధికారులు ప్రాజెక్టు ముం దు భాగంలో ఎత్తు ఉన్న ప్రాంతాన్ని లోతుగా మా ర్చితే నీరు భారీగా నిలిచే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
-ప్రాజెక్టు పూడిక తీత పనులు చేపట్టాలి
తగరం మల్లయ్య, రైతు
గొల్లవాగు ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం త గ్గుతుంది. ఉపాధి హామీపనుల ద్వారా గొల్ల వాగు ప్రాజెక్టులో పూడిక తీత పనులు చేపడితే నీటి సా మర్థ్యం పెరిగి రైతుల రెండు పంటలకు సరిపడ నీ రందే అవకాశం ఉంటుంది. ఉపాధి హామీ ద్వారా పూడిక తీత చేపడితే కూలీలకు పనులు దొరకడంతో పాటు రైతుల పంటలకు నీరందుతుంది. గొల్లవాగు ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పెంచేలా అధికారులు కృషి చేయాలి.