Mini Jatara.. మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు
ABN , Publish Date - Feb 12 , 2025 | 07:15 AM
ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం నిర్వహించనున్నారు. మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ నుండి గుత్తి కోయలు, ఆదివాసీలు; జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడా; మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రతీసాగర్ గోండులు; ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు.

ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం (Medaram) సమ్మక్క-సారలమ్మల (Sammakka Saralamma) మినీ జాతర (Mini Jatara) బుధవారం ప్రారంభం కానుంది. ఈనెల 15వ తేదీ వరకు ఈ జాతర జరుగుతుంది. భక్తులు వన దేవతలకు మొక్కలు చెల్లించకోనున్నారు. మేడారం ఊరిలోని గుడిలో మండమెలిగే పండగ ఆదివాసి సంప్రదాయంలో గిరిజనులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని పూజారులు అమ్మవార్ల మినీజాతర నిర్వహించనున్నారు. గుడిమెలిగే పండగను అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమయ్యారు.
ఈ వార్త కూడా చదవండి..
మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రాంతాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ నుండి గుత్తి కోయలు, ఆదివాసీలు; జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడా; మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రతీసాగర్ గోండులు; ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు. ప్రపంచంలో ఆదివాసీలు ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యే వేడుక మరొకటి లేదు. ఆదివాసీలు కాకుండా ఇతర మత, వర్గ, వర్ణాల వారు కోట్లాదిగా హాజరయ్యే ప్రార్థనాలయాలు, పూజా స్థలాలు–శబరిమల, మక్కా, జెరూసలేం, కుంభమేళా, తిరుపతి వంటివి–ఉన్నాయి. కానీ ఏమాత్రం కనీస సౌకర్యాలు లేకుండా, దట్టమైన అటవీ ప్రాంతంలో, కేవలం కొయ్యలను కోయ దేవతలుగా భావిస్తూ పూజించడానికి కోటిన్నరమంది రావడం ప్రపంచంలోనే మరెక్కడా కానరాదు. అందుకే, దీనిని, అత్యంత అరుదైన జన జాతరగా భావించవచ్చు.
ములుగు మన్నెంలో జాతరల సందడి
ములుగు ఏజెన్సీలో జాతరల సందడి నెలకొంది. ఆదివాసీలు తమ ఇలవేల్పులను కొలుచుకొనే వేడుకలతో గూడేలు పండగ వాతావరణం సంతరించుకున్నాయి. తాడ్వాయి మండలం మేడారంలో సమ్మ క్క, సారలమ్మ చిన్నజాతర బుధవారం ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు నాలుగు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. తొలిరోజు సమ్మక్క కొలువైన మేడారంతోపాటు సారలమ్మ కొలువుదీరిన కన్నెపల్లిలోని పూజా మందిరాలను శుద్ధిచేసి అలుకుపూతలు చేస్తారు. గ్రామాలకు ద్వారబంధనం విధించి పొలిమేర దేవతలకు పూజలు నిర్వహిస్తారు. రాత్రివేళ వనదేవతల గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి జాగరణ చేస్తారు. వనదేవతలుగా కీర్తించబడుతున్న సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, నాగులమ్మ నడయాడిన అడవి పల్లెల్లో అక్కడి గిరిజనులు అనుబంధ జాతరలను జరుపుతున్నారు. సమ్మక్కకు పుట్టినిల్లయిన తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో కూడా బుధవారం నుంచే జాతర జరగనుంది.
తమ ఆడబిడ్డగా కొలుచుకునే చందా వంశీయులు సమీపంలోని గుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి చేర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. ఏటూరునాగారం మండలం కొండాయిలో గోవిందరాజులు, నాగులమ్మ, దొడ్లలో సారలమ్మ, కన్నాయిగూడెం మండలం ఐలాపూర్‌లో సమ్మక్క, సారలమ్మ, మంగపేట మండలం జబ్బోనిగూడెం నెమళ్లగుట్టపై సమ్మక్క జాతర బుధవారం నుంచి మొదలై నాలుగు రోజులు జరగనుంది. మేడారంలో జరిగే చిన్నజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.4కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్టీసీ హనుమకొండ బస్టాండు నుంచి వారంపాటు వంద ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ నేతృత్వం లో ఇద్దరు అదనపు ఎస్పీలు, డీఎస్పీ, 12 మంది సీఐలు, 30 మంది ఎస్సైలతోపాటు 600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి
ఏడాదైనా ఫైళ్లు క్లియర్ చేయరా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News