Share News

హామీలు అమలు చేస్తున్నాం

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:44 PM

న్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి నాయ కత్వంలోని కాంగ్రెస్‌ ప్రభు త్వం అమలు పరుస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.

హామీలు అమలు చేస్తున్నాం
ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి - కొనసాగుతున్న జైబాపు, జైభీమ్‌, జై సంవిధాన్‌

కల్వకుర్తి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి నాయ కత్వంలోని కాంగ్రెస్‌ ప్రభు త్వం అమలు పరుస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కడ్తాల్‌ మండలం గానుగమండ్ల తం డా, తలకొండపల్లి మండలంలోని వెంకటాపూ ర్‌తండా, పెద్దూరుతండా, పడకల్‌ పంచాయతీ ల్లో జైబాపు, జైభీమ్‌, జై సంవిధాన్‌ కార్యక్రమం లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలందరికీ కడుపునిండా అన్నం పె ట్టాలన్న సంకల్పంతోనే సన్నబియ్యం పథకాన్ని ప్రభుత్వం అమలుపరుస్తున్నదని తెలిపారు. మ హిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, 200యూనిట్ల ఉచిత విద్యుత్‌, రుణమాఫీతో పాటు ఎన్నో పథకాలను అమలుపర్చడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం పడకల్‌లో మొక్కజొన్న, సన్‌ఫ్లవర్‌, వరి కొనుగోలు కేంద్రా లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్ర మాల్లో పీసీసీ సభ్యులు ఆయిల్ల శ్రీనివాస్‌గౌడ్‌, పలువురు అధికారులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:44 PM