Share News

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ..పూర్తి షెడ్యూల్ ఇదే

ABN , Publish Date - Mar 15 , 2025 | 08:40 AM

CM Chandrababu: సీఎం చంద్రబాబు శనివారం ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది.

 CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ..పూర్తి షెడ్యూల్ ఇదే
CM Chandrababu

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇవాళ(శనివారం) పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు హెలికాఫ్టర్‌లో ఉండవల్లి నుంచి తణుకు రానున్నారు. హెలిప్యాడ్ వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు.అనంతరం 8.40 గంటలకు ఎన్టీఆర్ పార్క్‌కు ఏపీ సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.


పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో నిర్వహిస్తారు. అనంతరం స్వచ్ఛ్ దివస్‌లో కార్యక్రమంలో పాల్గొంటారు.తర్వాత 50 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఫొటో సెషన్ ఉంటుంది. అనంతరం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలకు చేరుకుంటారు. ప్రజావేదికపై నుంచి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. పారిశుధ్య కార్మికులను సీఎం చంద్రబాబు సత్కరిస్తారు. 10.15 గంటలకు పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో జరిగే సమావేశానికి హాజరవుతారు. 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం12 గంటల 10 నిమిషాలకు తణుకు నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.


వేంకటేశ్వర స్వామి కల్యాణంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

వెంకటపాలెం వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాసుని కల్యాణం జరుగనుంది.శ్రీనివాస కల్యాణం సందర్భంగా టిటిడి అధికారులు భారీ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:30గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి 8:30 నిమిషాల వరకు స్వామి వారి కల్యాణం జరుగనుంది. శ్రీవారి కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu Naidu: నిబద్ధతతో కూడిన రాజకీయాలకు ప్రతీక జనసేన

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 08:42 AM