రామయ్య ఆలయ అభివృద్ధికి శ్రీకారం

ABN, Publish Date - Apr 03 , 2025 | 12:53 PM

Bhadrachalam Temple: దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం టెంపుల్ సిటీగా మారనుంది. కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భద్రాచలం రామాలయం అభివృద్ధికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది.

భద్రాచలం, ఏప్రిల్ 3: భద్రాద్రి రామాలయ (Bhadrachalam Temple) పరిసరాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. మాఢవీధులను విస్తరించి అభివృద్ధి పనులను పట్టించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. రామ భక్తుడైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) చొరవతో ఈ పనులు మొదలుకాబోతున్నాయి. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం టెంపుల్ సిటీగా మారనుంది. కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భద్రాచలం రామాలయం అభివృద్ధికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆలయ మాఢవీధుల విస్తరణకు అనుమతులిస్తూ నిధులు కూడా విడుదల చేసింది.


కాంగ్రెస్ పాలనలోనే భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి తుమ్మల పట్టుదల కార్యరూపం దాల్చగా.. ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Amaravati Capital Construction: అమరావతికి నిధులొచ్చాయ్‌

Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు

Read Latest Telangana News And Telugu News

Updated at - Apr 03 , 2025 | 12:53 PM