తాగుబోతు జాతిపిత ఎలా అవుతారు: సీఎం రేవంత్ రెడ్డి..
ABN, Publish Date - Mar 16 , 2025 | 04:32 PM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితని మాజీ మంత్రి హరీష్‌రావు అనడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. జాతిపితకు కేసీఆర్‌కు ఏమైనా పోలిక ఉందా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
జనగామ: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితని మాజీ మంత్రి హరీష్‌రావు అనడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. జాతిపితకు కేసీఆర్‌కు ఏమైనా పోలిక ఉందా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అసలైన జాతిపితకు మందు వాసన తెలుసా? హరీశ్ రావు అంటూ చురకలు అంటించారు. నిజమైన జాతిపిత దళిత వాడల్లో జీవితం గడిపారని, మరి హరీశ్ రావు చెప్పే జాతిపిత ఫామ్ హౌస్‍లో పడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ.జయశంకర్ అని చెప్పుకొచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం శివునిపల్లెలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధి కేసీఆర్‌కు పట్టదని, తీసుకుంటున్న జీతానికైనా ఆయన న్యాయం చేయడం లేదంటూ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం రూ.లక్ష కోట్లు ఎలా సంపాదించిందో చెప్పాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు చేసిన మంత్రి లోకేశ్..
CM Chandrababu: పొట్టి శ్రీరాములు జయంతి వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Updated at - Mar 16 , 2025 | 04:34 PM