ఆశా వర్కర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ABN , Publish Date - Mar 02 , 2025 | 10:06 AM
ఆశా వర్కర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాలు కురిపించారు. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. వారికి ఇచ్చిన హామీలకు ఈ మేరకు ఆయన ఆమోదముద్ర వేశారు.

అమరావతి: ఆశా వర్కర్ల (Asha Workers)కు ఏపీ ప్రభుత్వం (AP Govt) తీపికబురు (Good News) చెప్పింది. వారు కోరుతున్న ప్రయోజనాల అమలుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న 43 వేల మందికిపైగా ఆశా వర్కర్లకు లబ్ది చేకూరనుంది. ఆశా వర్కర్ల చిరకాల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సానుకూలంగా స్పందించారు. వారికి ఇచ్చిన హామీలకు ఆమోదముద్ర వేశారు. గ్రాడ్యూటీ చెల్లింపు ఏ విధంగా ఉండాలి.. దానిపై వివిధ రాష్ట్రాల్లోని ఆశా వర్కర్లకు అందజేసిన వేతనాలు, పదవి విరమణ అనంతర ప్రయోజనాలు తదితరాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయం పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
డీఐజీ సునీల్ నాయక్‌కు నోటీసులు
ఈ వార్తలు కూడా చదవండి..
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
రైతులను భయభ్రాంతులకు గురిచేసిన అఘోరి...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News