కుటుంబసభ్యులతో నారావారి పల్లెకు మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - Jan 12 , 2025 | 10:10 PM
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఐటీ మంత్రి నారా లోకేష్.. తన కుటుంబ సమేతంగా ఆదివారం నారా వారి పల్లెకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం కుటుంబ సమేతంగా ఆయన.. రోడ్డు మార్గం ద్వారా నారా వారి పల్లెకు బయలుదేరి వెళ్లారు.
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఐటీ మంత్రి నారా లోకేష్.. తన కుటుంబ సమేతంగా ఆదివారం నారా వారి పల్లెకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం కుటుంబ సమేతంగా ఆయన.. రోడ్డు మార్గం ద్వారా నారా వారి పల్లెకు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు విమానాశ్రయంలో కేడర్..యోగ క్షేమాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.. నారా లోకేష్ వెంట ఉన్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 12 , 2025 | 10:10 PM