Amit Shah: సీఎం అభ్యర్థిగా నితీష్ ఊసెత్తని అమిత్‌షా.. కారణాలు ఏమిటంటే
ABN , Publish Date - Mar 31 , 2025 | 09:40 PM
నితీష్ ఆరోగ్యం బాగోలేదని, మానసికంగా, శారీరకంగా ఫిట్‌నెస్ కోల్పోయారని విపక్ష ఆర్జేడీ సహా పలువురు కీలక నేతలు ఇటీవల పదేపదే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆసక్తికరంగా నితీష్ మానసిక పరిస్థితిని అమిత్‌షా అదివారంనాడు జరిగిన కార్యక్రమంలో గుర్తించినట్టు చెబుతున్నారు.

పాట్నా: బీజేపీలో అపర చాణుక్యుడుగా పేరున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఆదివారంనాడు బీహార్ పర్యటనలో సీఎం నితీష్ కుమార్ కుమార్ వ్యవహారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 2025 అక్టోబర్-నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, సీఎం అభ్యర్థిగా నితీష్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. నితీష్ ఆరోగ్యం బాగోలేదని, మానసికంగా, శారీరకంగా ఫిట్‌నెస్ కోల్పోయారని విపక్ష ఆర్జేడీ సహా పలువురు కీలక నేతలు ఇటీవల పదేపదే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆసక్తికరంగా నితీష్ మానసిక పరిస్థితిని అమిత్‌షా అదివారంనాడు జరిగిన కార్యక్రమంలో గుర్తించినట్టు చెబుతున్నారు.
PM Modi: 2029లోనూ మోదీనే ప్రధాని: సీఎం ఫడ్నవిస్
అమిత్‌షా అధ్యక్షత వహించిన ఆ కార్యక్రమంలో ఒక నడివయస్కురాలైన మహిళా లబ్దిదారును అమిత్‌షా సన్మానిస్తుండగా ఆమె భుజం చుట్టూ నితీష్ తన చేతిని ఉంచారు. ఈ విషయం గ్రహించిన అమిత్‌షా ఆ తర్వాత గోపాల్‌గంజ్‌లో జరిగిన సభలో నితీష్ 20 ఏళ్లుగా అందించిన సుపరిపాలన గురించి మాత్రమే ప్రస్తావించారు. పాట్నాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కానీ, గోపాల్ గంజ్ బీజేపీ ర్యాలీలో కానీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నితీష్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు.
ముచ్చటగా మూడు కారణాలు..
సీఎం అభ్యర్థిగా నితీష్ పేరును ప్రస్తావించకుండా అమిత్‌షా దూరంగా ఉండటానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు.
మొదటిది: నితీష్‌ను సీఎం అభ్యర్థిగా ముందుగానే ప్రకటిస్తే, 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కావచ్చు. అప్పటి ఎన్నికల్లో ఎన్డీయే మెజారిటీ సాధించినప్పటికీ మొత్తం 243 సీట్లలో జేడీయూ కేవలం 43 సీట్లు గెలుచుకుంది. అయినా నితీష్ తిరిగి సీఎం అయ్యారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురైతే ఆరోగ్యం దిగజారినట్టు చెబుతున్న నితీష్‌తో బీజేపీ కచ్చితంగా 'రిస్క్' చేయాల్సి ఉంటుంది.
రెండవది: హిందీ హార్ట్‌లాండ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి లేని ఏకైక రాష్ట్రం ప్రస్తుతం బీహార్ మాత్రమే ఉంది. బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నప్పటికీ ఇప్పటివరకూ సొంతంగా బీహార్‌లో అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్డీయే బీహార్‌లో అధికారంలోకి వస్తే బీజేపీ సీఎం ఉండితీరాలనే నిశ్చితాభిప్రాయంతో అటు ప్రధానమంత్రి మోదీ, ఇటు అమిత్‌షా ఉన్నారని చెబుతున్నారు.
మూడవది: బీహార్‌కు సొంత సీఎం ఉండాలనే కచ్చితమైన వ్యూహం బీజేపీకి ఉన్నప్పటికీ ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేని పరిస్థితి మాత్రం ఆ పార్టీకి ఉంది. దీంతో నితీష్ సుపపాలనను ప్రశంసిస్తూనే సానుకూల ఎన్నికల ఫలితాలు రాబట్టడమే బీజేపీ ప్రస్తుత ఆప్షన్‌గా ఉంది. నితీష్ ఇటు ఎన్డీయేలో ఉన్నా, అటు మహాఘట్‌బంధన్‌తో జోడీ కట్టినా ఆయనకు ఉన్న 14 శాతం విధేయ ఓట్ బ్యాంక్ మొదట్నించీ చెక్కుచెదరకుండా ఉంటోంది. ఎన్డీయే గెలుపునకు ఈ ఓట్ బ్యాంక్ అవసరమనే విషయం బీజేపీకి తెలియనది కాదు.
ఫలితాలు వచ్చిన తర్వాతే..
కాగా, ఈ పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అజయ్ కుమార్ నిశితంగా విశ్లేషించారు. ''నితీష్ పేరును ఉపయోగించుకుంటూ ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా బీజేపీ ప్లాన్ ఉండొచ్చు. ఒకసారి ఫలితాలంటూ వచ్చిన తర్వాత ఆయనను (నితీష్) ఏదో ఒక సాకుతో పక్కనపెట్టేసి, బీహార్ తదుపరి సీఎంగా సొంత పార్టీ నేతనే ఎన్నుకుంటారు" అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్జేడీ నేతలతో పాటు అధికార పార్టీ నేతలతో తాను జరిపిన సంభాషణాల్లోనే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోందని అజయ్ కుమార్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Kunal Kamra Row: కునాల్‌కు శివసేన స్టైల్‌లో స్వాగతం చెబుతాం.. రాహుల్ కనల్
వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
For National News And Telugu News