రామానాయుడు స్టూడియో భూముల పై కూటమి సర్కార్ కీలక నిర్ణయం
ABN, Publish Date - Apr 04 , 2025 | 09:25 PM
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూములు దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ క్రమంలో 15.17 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని విశాఖపట్నం కలెక్టర్‌ను ఆదేశించింది. విశాఖ వేదికగా సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాటి టీడీపీ ప్రభుత్వం 2003లో బీమిలి బీచ్ రోడ్డులోని 34. 44 ఎకరాల భూమిని ఎస్‌పీ ప్రోడక్షన్‌కు కేటాయించింది.

అందులోభాగంగా ఎకరా భూమిని 5.2 లక్షల చొప్పున కేటాయించింది. అందులోని కొంత భూమిలో రామానాయుడు స్డూడియోను నిర్మించారు. మిగిలిన భూమి ఖాళీగా ఉంచారు. ఈ స్టూడియో భూములు వెనక్కి తీసుకోకుండా ఉండేందు 15 ఎకరాలు తమకు కేటాయించాలని గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు డిమాండ్ చేశారు.
Updated at - Apr 04 , 2025 | 09:25 PM