ఆ షాపులన్నీ అక్రమమైనవని తెలిసినా..

ABN, Publish Date - Mar 14 , 2025 | 12:03 PM

ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండడం.. జీవీఎంసీ పీఠం కూడా వైసీపీ చేతిలో ఉండడంతో అధికారులు ఎవరూ నైట్ ఫుడ్ కోర్టును పట్టించకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో నైట్ ఫుడ్ బజారుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

విశాఖ: వైసీపీ (YCP) హయాంలో ఏర్పాటు చేసిన నైట్ ఫుడ్‌ (Night Food)తో జీవీఎంసీ (GVMC)కి పెద్ద మొత్తంలో గండి పడుతోంది. అయితే ప్రైవేటు వ్యక్తులు మాత్రం ఈ ఫుడ్ కోర్టు ద్వారా లక్షలాది రూపాయాలు ఆర్జిస్తున్నారు. నైట్ ఫుడ్ కోర్టులో ఉన్న షాపులన్నీ అక్రమమైనవని (Illegal Shops) తెలిసినా.. వాటిని తొలగించడంలో అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు.

Also Read..:

శంషాబాద్‌కా.. వామ్మో అంటున్న క్యాబ్ డ్రైవర్లు..


విశాఖ పాత జైలు రోడ్డు సమీపంలోని ఉమెన్స్ కాలేజీకి ఎదురుగా ఉన్న నైట్ ఫుడ్ బజారు జగన్ రెడ్డి హయాంలో ఏర్పాటైంది. బొత్స సత్యానారాయణ దీన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే ఇది ఏ ముహూర్తాన ప్రారంభమైందో అప్పటి నుంచి అంతా వివాదాసపదమే. ఇందులో చిరు వ్యాపారస్తులకు చోటు కల్పించకుండా వైసీపీ నేతులు తమ అనుచరులతో షాపులు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా నైట్ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసి వైసీపీ నేతలు ప్రతినెల లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం..

హోలీ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు..

అందులో పవన్ కల్యాణ్ పీహెచ్‌డీ..

For More AP News and Telugu News

Updated at - Mar 14 , 2025 | 12:03 PM