Pawan Kalyan : కొడుకు ఆపదలో ఉన్నా.. మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..

ABN, Publish Date - Apr 08 , 2025 | 05:38 PM

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కొడుకు మార్క్ శంకర్‌ పవనోవిచ్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడినా.. ప్రజలే ముఖ్యమనుకుని ముందుకు కదిలాడు.

Pawan Kalyan : సింగపూర్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ రవిశంకర్ పవనోవిచ్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. రివర్‌ వ్యాలీ షాప్‌హౌస్‌లో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలై చికిత్స పొందుతున్నాడు. కొడుక్కి ఇంత ప్రమాదం జరిగినా గిరిజనులకు ఇచ్చిన మాట కోసం సింగపూర్ ప్రయాణం వాయిదా వేసుకున్నారు పవన్. ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేశాకే వెళ్తానని చెప్పారు. అలాగే చేశారు.

Updated at - Apr 08 , 2025 | 05:39 PM