Home » ABN Big Debate With RK
ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పలు అంశాలను పంచుకున్నారు. అనకాపల్లిలో పోటీకి గల కారణం, అక్కడ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చావు కదా ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ప్రశ్నిస్తే ఇవ్వలేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. తన కంపెనీని పదేళ్ల క్రితమే వదిలేశానని.. షేర్లు మాత్రమే ఉన్నాయని అంగీకరించారు.
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమిత్ షా, నరేంద్ర మోదీ మనసును అతి తక్కువ కాలంలో సీఎం రమేష్ చూరగొన్నారు. సీఎం రమేష్ తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించగా.. కన్విన్స్ చేయగల శక్తి ఆ దేవుడు తనకు ఇచ్చారని సమాధానం ఇచ్చారు.
సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత గ్రాఫ్ డౌన్ అయ్యిందని ఆర్కే ప్రశ్నించగా అదేం లేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. జగన్ బస్సుయాత్రకు క్రేజీ వచ్చిందని అసత్య ప్రచారం చేసుకున్నారని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించింది తానేనని గుర్తుచేశారు. రాజ్యసభకు పోటీ చేస్తానని ప్రకటిస్తే.. సీఎం జగన్ భయపడ్డారని తెలిపారు. సీఎం జగన్ వైసీపీ నేతలతో చెప్పిన విషయం తనకు 5 నిమిషాల్లో తెలిసిందని చెప్పారు.
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను 30 ఏళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాల్సి ఉండేదని వివరించారు. 1998లో చిత్తూరు నుంచి పోటీ చేయాలని, చివరి క్షణంలో టికెట్ చేజారిందని గుర్తుచేశారు.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) నేడు (సోమవారం) ‘బిగ్ డిబేట్’ చర్చకు బీజేపీ సీనియర్ నేత, అనకాపల్లి ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్ (CM RAMESH) వచ్చారు.
దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN MD Radha Krishna) పెన్ను పట్టి ‘కొత్తపలుకు’ (Kothapaluku) రాసినా.. టీవీలో కూర్చుని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) ఇంటర్వ్యూ చేసినా అదో సంచలనమే అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ఇప్పటి వరకూ ఎందరో సినీ, రాజకీయాలతో పాటు ఇతర రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి.. సంచలనమే సృష్టించారు...