Share News

GT vs MI Match Prediction: బోణీ కోసం పొట్టేళ్ల పోట్లాట.. గెలుపు రుచి చూసేదెవరో..

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:52 PM

Today IPL Match: బోణీ కొట్టాలని వెయిట్ చేస్తున్న రెండు టఫ్ టీమ్స్ గుజరాత్-ముంబై మధ్య ఫైట్‌కు అంతా రెడీ అయింది. ఇరు జట్లు గెలిచి తీరాలని భావిస్తున్న ఈ పోరు చివరి వరకు ఉత్కంఠగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

GT vs MI Match Prediction: బోణీ కోసం పొట్టేళ్ల పోట్లాట.. గెలుపు రుచి చూసేదెవరో..
GT vs MI

ఐపీఎల్ 2025లో ఇవాళ బోణీ కోసం రెండు పొట్టేళ్ల మధ్య పోరు జరగనుంది. ఆడిన చెరో మ్యాచ్‌లో ఓడిన గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్.. రెండు టీమ్స్ ఇవాళ తాడోపేడో తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలుపు రుచి చూడాలని ఇరు జట్లు పంతంతో ఉన్నాయి. విజయంతో గాడిన పడి పాయింట్స్ టేబుల్‌లో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్-ముంబై జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి.. రికార్డులు ఏం చెబుతున్నాయి.. నెగ్గేదెవరు అనేది ఇప్పుడు చూద్దాం..


బలాలు

గుజరాత్: ఈ టీమ్‌లో సాలిడ్ బ్యాటర్లు ఉన్నారు. సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్, జోస్ బట్లర్, రూథర్‌ఫోర్డ్ రూపంలో సిచ్యువేషన్‌‌కు తగ్గట్లు ఆడే ప్లేయర్లు ఉన్నారు. వీళ్లంతా లాస్ట్ మ్యాచ్‌లో రాణించారు. బౌలింగ్‌లో సాయి కిషోర్ మంచి టచ్‌లో ఉన్నాడు.

ముంబై: ఈ జట్టు బలం కూడా బ్యాటింగే. రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రూపంలో టాప్ క్లాస్ బ్యాటర్లు టీమ్‌లో ఉన్నారు. కానీ ఫస్ట్ మ్యాచ్‌లో ఒక్కరు కూడా రాణించలేదు. తమదైన రోజున అంతా ఒక్కచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సామర్థ్యం ఉన్న ఈ బ్యాటర్లు ఫామ్‌లోకి వస్తే ప్రత్యర్థికి దబిడిదిబిడే. బౌలింగ్‌లో విఘ్నేశ్ పుతుర్ రూపంలో సెన్సేషనల్ స్పిన్నర్ దొరికాడు. అతడితో పాటు ఇతర బౌలర్లూ చెలరేగాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు.


బలహీనతలు

గుజరాత్: ఈ జట్టు బౌలర్లు తొలి మ్యాచ్‌లో సరిగ్గా బౌలింగ్ చేయలేదు. సిరాజ్, రబాడతో పాటు రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అదే ఆ టీమ్‌కు మైనస్‌గా మారింది. బౌలింగ్ వైఫల్యం నుంచి ఎంత త్వరగా బయటపడితే జీటీకి అంత మంచిది.

ముంబై: ఈ టీమ్‌కు బ్యాటింగే బలం, బ్యాటింగే వీక్‌నెస్‌గానూ కనిపిస్తోంది. రోహిత్ ఇంకా టచ్‌లోకి రాలేదు. జాక్స్, రికల్టన్ తొలి మ్యాచ్‌లో ఫ్లాప్ అయ్యారు. యువ ఆటగాడు రాబిన్ మింజ్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. అటు బౌలింగ్‌లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. బౌల్ట్, చాహర్ పరుగులు కట్టడి చేస్తున్నా.. ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోతున్నారు.


రికార్డులు

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 5 మ్యాచులు జరిగాయి. ఇందులో ముంబై రెండింట్లో, గుజరాత్ మూడింట్లో నెగ్గాయి. నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటిదాకా ఈ రెండు టీమ్స్ తలపడిన మూడు మ్యాచుల్లోనూ జీటీదే విజయం.

మ్యాచ్ అంచనా

బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా ఎందులో చూసుకున్నా ముంబై కంటే ప్రస్తుతం గుజరాత్ బలంగా కనిపిస్తోంది. దానికి తోడు రికార్డులు కూడా ఆ టీమ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఫ్యాన్‌బేస్ ఎక్కువ కాబట్టి తప్పక నెగ్గాలనే ప్రెజర్ జీటీ కంటే ఎంఐ మీదే అధికం. వీటన్నింటనీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇవాళ్టి మ్యాచ్‌లో గుజరాత్ గెలవడం ఖాయం.


ఇవీ చదవండి:

కోహ్లీ క్రేజీ డ్యాన్స్.. వాళ్లకు నిద్రపట్టదు

కోహ్లీతో పెట్టుకున్నాడు.. ఇక కెరీర్ ఖతం

మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2025 | 05:03 PM