Home » ABN
Bengaluru: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఇంతలో బాలిక బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఆ బాలికను హత్య చేసి అక్కడి నుంచి సదరు యువకుడు పరారయ్యాడు. అతడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
Capital Amaravati: రాష్ట్ర విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశ చిత్ర పటంలో నిలిచిపోయింది. అదే సమయంలో ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం రాష్ట్ర రాజధాని కోసం అన్వేషణ ప్రారంభించింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. మరోవైపు యూఎస్లోని విదేశీయులే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటికే సుంకాల కారణంగా విదేశాల నుంచి ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే యూఎస్లోని విదేశీయులే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది.
AB Venkateswara Rao: వైఎస్ జగన్ బాధితులకు న్యాయం చేయడానికి తన పోరాటం మొదలైందని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అందులోభాగంగా తొలి ప్రయత్నంగా కోడి కత్తి శ్రీనుకు న్యాయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆ క్రమంలో ముమ్మడివరంలోని కోడికత్తి శ్రీనును అతడి నివాసంలో ఆయన కలిశారు.
IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
Fire Accident: అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Vontimitta: ఒంటిమిట్టలో కొలువు తీరిన శ్రీసీతారామచంద్రమూర్తికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీతారాముల కల్యాణం జరిగింది. ఈ కల్యాణాన్ని సీఎం దంపతులు వీక్షించారు. రాత్రికి సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టలోనే బస చేయనున్నారు.
Pocso Court: బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది నాంపల్లిలోని పోక్సో్ కోర్టు. అలాగే జరిమాన సైతం విధించింది. నేరం రుజువు కావడంతో ఈ శిక్షను ఖరారు చేసింది.
Mahesh Kumar Goud: రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలు నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో కేటీఆర్ అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ ఫ్యామిలీపై సీబీఐతో విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Gorantla Madhav: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరులోని జీజీహెచ్ వద్ద హంగామా చేశాడు. ముఖానికి మాస్క్ వేసుకోమంటే.. వేసుకొనంటూ నిరాకరించాడు. అలాగే అతడిని విలేకర్ల సమావేశంలో పెట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అతడు ఈ సమావేశానికి రానంటూ పోలీస్ వాహనంలోనే కూర్చొండి పోయారు. దీంతో చేసేది లేక పోలీసులు అతడికి కోర్టులో హజరుపరిచేందుకు తరలించారు.