Home » ACB
అగ్రిగోల్డ్ స్కామ్ గంటగో మలుపు తిరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కామ్‌లో రాజీవ్ కీలక పాత్ర పోషించారని చెప్పిన ఏసీబీ (AP ACB) అధికారులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు...
ఏసీబీ దాడులతో మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమాల పుట్ట బద్ధలవుతోంది. ఆయన దోపిడీ యవ్వారం అంతా బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
అమరావతి: అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరి కొందరు నిందితులు ఉన్నారు. వారి వివరాలు..1. జోగి రాజీవ్, 2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, 3. అడుసుమిల్లి మోహన రంగ దాసు, 4. వెంకట సీతామహాలక్ష్మీ, 5. సర్వేయర్ దేదీప్య 6. మండల సర్వేయర్ రమేశ్, 7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, 8. విజయవాడ రూరల్ ఎమ్మార్వో ( MRO) జాహ్నవి, 9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులుగా అధికారులు తెలిపారు.
Telangana: నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. పిల్లలకు అందుతున్నకాస్మొటిక్ చార్జెస్, పౌష్టికాహారం, ఆడిట్ వివరాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలాజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు సోదాలు నిర్వహించారు.
రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్టు చేశారు. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, భూపాల్ రెడ్డి నివాసంతో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
నగరపాలక సంస్థ సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారి నరేందర్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుడు నరేందర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు అధికారులు తరలించారు. అనంతరం ఇవాళ అతని బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు.
నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాదాపు రూ.3కోట్ల నగదు(2,93,81,000)ను స్వాధీనం చేసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ జాహెద్‌పాషా శనివారం ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకారం.. ఓదెల మండలం చిన్నకొమిరె గ్రామానికి చెందిన కడెం తిరుపతికి కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామ శివారులో 28 గుంటల భూమి ఉంది.
నిందితులను కేసు నుంచి తప్పించడానికి లంచం తీసుకుంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు శుక్రవారం చిక్కాడు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం గత నెల 27న బెల్లం లోడుతో వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని అన్నారంషరీఫ్ వద్ద పర్వతగిరి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఆస్తుల మదింపునకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారి శ్రీధర్‌ను అవినీతి నిరోధకశాఖ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.