Home » ACB
Telangana: కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై ఏసీబీ అధికారులు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే గ్రీన్కో తో పాటు అనుబంధ మూడు కంపెనీలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు న్యాయవాదులతో కలిసి వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను పోలీ్‌సలు ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించలేదు.
ACB Notice: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.
Formula E-Car Race Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ తన లీగల్ టీమ్‌తో ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. అయితే కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. కేటీఆర్ వెంట న్యాయవాదులు వెళ్ళకూడదంటూ అడ్డుకున్నారు. దీనిపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఏసీబీ అధికారికి లేఖ ఇచ్చి వెళ్లిపోయారు.
హైదరాబాద్: ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఉదయం జూబ్లిహిల్స్, నందినగర్‌లోని తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వస్తున్న నేపథ్యంలో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ కార్యాలయం నాలుగవైపులా భారీగా పోలీసులు మోహరించారు.
భూ సర్వే, నాలా కన్వర్షన్ కోసం లంచాలు తీసుకుంటూ సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి.
గనుల శాఖలో దొంగలు పడ్డారు. నాడు జగన్ ప్రభుత్వంలో మైనింగ్ కంపెనీల నుంచి బలవంతంగా వాటాలు తీసుకొని సెటిల్ చేసిన కీలక ఫైళ్లు ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం రాకముందే వాటిని మాయం చేసేశారు.
Telangana: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈడీకి ఏసీబీ అందజేసింది. ఏసీబీ ఇచ్చిన వివరాలను ఈడీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈడీ విచారణను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.
Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో ఫిర్యాదుదారుడు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణను ప్రారంభించనున్నారు. దాన కిషోర్ నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి దానకిషోర్ వివరణ ఇచ్చారు.