Share News

KTR: ఫార్ములా-ఈ కారు రేసు కేసు.. ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్..

ABN , Publish Date - Jan 06 , 2025 | 10:35 AM

హైదరాబాద్: ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఉదయం జూబ్లిహిల్స్, నందినగర్‌లోని తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వస్తున్న నేపథ్యంలో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ కార్యాలయం నాలుగవైపులా భారీగా పోలీసులు మోహరించారు.

KTR: ఫార్ములా-ఈ కారు రేసు కేసు.. ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్..

హైదరాబాద్: ఫార్ములా-ఈ కారు రేసు కేసు (Formula-E car race Case)కు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ACB) సోమవారం మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)ను విచారించనుంది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసులు (Notice) జారీ చేశారు. న్యాయ నిపుణుల సూచన మేరకు ఈ కేసులో విచారణకు హాజరవుతానని కేటీఆర్‌ కూడా శనివారం బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో తెలిపారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కేటీఆర్ నందినగర్ తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు. అంతకుముందు బంజారాహిల్స్, నందినగర్ కేటీఆర్ నివాసంలో ఆయనతో మాజీమంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వస్తున్న నేపథ్యంలో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ కార్యాలయం నాలుగవైపులా భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏసీబీ కార్యాలయం ముందు ఆందోళన చేసే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మంది పోలీసులతో నాలుగు వైపుల బందోబస్తు.. టాస్క్ ఫోర్స్‌తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.


కాగా ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి న్యాయ నిపుణుల సూచన మేరకు ఈ కేసులో విచారణకు హాజరవుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ శనివారం బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో తెలిపారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్ర యించారు. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని పేర్కొంది. అయితే విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులిచ్చింది. దీంతో సోమవారం జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసులో సహనిందితులుగా ఉన్న బీఎల్‌ఎన్‌ రెడ్డి, అరవిందకుమార్‌లనూ ఈ నెల 2, 3వ తేదిల్లోనే విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయగా.. వారిద్దరు కొంత సమయం కావాలని రాతపూర్వకంగా కోరారు. దీంతో వారికి ఈడీ అధికారులు వారం రోజుల వ్యవధి ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్

బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 06 , 2025 | 10:38 AM