Home » Adhir Ranjan Chowdhury
కోల్కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వం తరఫున వాదించ వద్దని కపిల్ సిబల్కు అధిర్ రంజన్ చౌదరి హితవు పలికారు. ఈ కేసు నుంచి వైదొలగాలని ఆయనను అభ్యర్థించాలనుకుంటున్నారన్నారు.
కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారంనాడు రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమబెంగాల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్ చౌదరి వైఖరి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీరియస్ అయ్యారు...