Home » Agriculture
ఆయిల్‌పామ్ కంపెనీలు వెంటనే ఫ్యాక్టరీల నిర్మాణాలు చేసి, ఆయిల్ పామ్ గెలల ప్రాసెసింగ్ మొదలుపెట్టేలా కార్యాచరణ ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం కలెక్టర్ శ్యారమ్‌పసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా గొరడ గిరిజన గ్రామంలో రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు.
వ్యవసాయంలో నష్టాలు రావడంతో సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు, కరెంటు షాక్‌తో ఇద్దరు అన్నదాతలు చనిపోయారు.
బ్యాంకుల నుంచి వచ్చే సమాచారానికి అనుగుణంగా ప్రతి ఖాతాదారుని అర్హతను బట్టి రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసింది. తొలి విడతలో లక్ష వరకు, రెండో విడతలో లక్షన్నర వరకు, మూడో విడతలో రూ. 2 లక్షల వరకున్న బకాయిలను మాఫీచేసింది.
అమరావతి: అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరి కొందరు నిందితులు ఉన్నారు. వారి వివరాలు..1. జోగి రాజీవ్, 2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, 3. అడుసుమిల్లి మోహన రంగ దాసు, 4. వెంకట సీతామహాలక్ష్మీ, 5. సర్వేయర్ దేదీప్య 6. మండల సర్వేయర్ రమేశ్, 7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, 8. విజయవాడ రూరల్ ఎమ్మార్వో ( MRO) జాహ్నవి, 9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులుగా అధికారులు తెలిపారు.
ఏ రకమైన వాతావరణాన్నయినా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే 109 రకాల కొత్త వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) నేడు (ఆగస్టు 11న) రైతులకు శుభవార్త చెప్పనున్నారు. ఢిల్లీ(delhi)లోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అధిక దిగుబడినిచ్చే 109 రకాల పంటల వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
దేశంలోనే మొట్టమొదటి ’రైస్ ఎటీఎం‘ను ఒడిసా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్‌లోని మంచేశ్వర్‌లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కృష్ణాచంద్ర పాత్ర ప్రారంభించారు.
నిర్దేశిత గడువుకల్లా రుణ మాఫీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్ర సర్కారు అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంపై దృష్టిసారించింది.