Home » Amalapuram
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని కల్తీచేసిన దోషులను కఠినంగా శిక్షించాలన్న ప్రధాన డిమాండ్‌తో గోవింద శంఖారావం పేరిట హిందూ సంఘాలు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అమలాపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిపాలవీధిలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద నుంచి వందలాది మంది నిరసన ర్యాలీగా బయలుదేరారు.
వర్షాల సీజన్ కావడంతో విద్యార్థులకు అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సూచించారు. సమనస మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అర్జీదారుల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను అదేశించారు. కలెక్టరేట్లోని గోదావరి భవన్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరాణి, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎ.మధుసూదనరావుతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము అమలులోకి వచ్చిందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయిశ్రీనివాస్ పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏటా సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహిస్తారని తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.
ఒక కార్యకర్త మంత్రి అయ్యారు.. అదృష్టం కలిసి వస్తే ఎవరూ అడ్డుకోలేరనే దానికి సుభాష్ సంఘటనే ఒక ఉదాహరణ. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subash) మూడు నెలల కిందట మండపేటలో తెలుగుదేశం (Telugu Desam) పార్టీలో చేరారు...
వ్రమైన కడుపు నొప్పి బాధపడుతున్న మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులే షాక్ అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 570 రాళ్లను ఆమె గాల్ బ్లాడర్‌లో కనిపెట్టారు వైద్యులు. శస్త్ర చికిత్స చేసి ఆ రాళ్లన్నింటినీ బయటకు తీశారు వైద్యులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ..
అమలాపురం: అంబాజీపేట సభలో వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. దోపిడీలు, దైర్జన్యాలు చేసే వైసీపీ నేతలను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని, గోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఉండి(Undi) నియోజకవర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) కీలక భేటీ నిర్వహించారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు(Raghurama Krishnam Raju) కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీ సందర్భంగా చంద్రబాబు సైతం కీలక కామెంట్స్ చేశారు.
అమలాపురంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఆడుతున్న థియేటర్ వద్ద అభిమానులు పెట్రోల్‌తో చెలగాటమాడారు.