Home » Amaravati
సాంకేతికతను వినియోగించి.. చేప లు, రొయ్యల ఉత్పత్తిలో ప్రతి ఏటా 15 శాతం వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్లు మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ చెప్పారు.
ముఖ్యమంత్రి కావడానికి ముందే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఆ కేసులను వాదిస్తున్న వారే జగన్ జమానాలో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్‌రికార్డు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ బుధవారం రాజధాని అమరావతిలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు చేయాల్సిన అంశాలపై సైతం ఈ సమావేశం వేదికగా చర్చించనున్నట్లు సమాచారం.
సభా నాయకుడిపైనే ఇలాంటి కుట్ర జరిగితే మరి మామూలు జనం పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఇది ముఖ్యమైన అంశమని, దీనిపై తప్పనిసరిగా చర్చించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కూడా అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం పలు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. కాగా పలు డిపార్టె మెంట్లకు సంబందించిన డిమాండ్స్‌పై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇస్తారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన సూచనలను అనుసరించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టం - 1986కు సవరణను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.
ఇసుక రేవుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక ఉచితంగా తీసుకు వెళ్ల వచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొన్న తర్వాత...
శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గనుల మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. వెలగలేరు, వేమవరం, కొత్తూరుతాడేపల్లి గ్రామాల్లో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్నారు.
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి వచ్చిన వారూ శాసన మండలిలో నీతులు చెప్పడం దారుణమని రాష్ట్ర హోం మంత్రి అనిత వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు.
జగన్ హయాంలో అన్నింటా నిర్లక్ష్యం తాండవమాడిందని, దీంతో ఆయా వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయని పలువురు మంత్రులు నిప్పులు చెరిగారు.