Home » Andhra Pradesh Politics
న్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఏపీలో(Andhra Pradesh) పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. అధికార పక్షాన్ని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో ఆ పార్టీ వారు అక్కసుతో, ఆగ్రహంతో రెచ్చిపోయి దాడులకు తెగపడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మరీ ఇలా తయారయ్యారేంట్రా.. ఇంత దుర్మార్గమా? అని ప్రశ్నిస్తున్నారు.
అనంతపురంలోని(Anantapur) ధర్మవరంలో(Dharmavaram) బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. మీటింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో(Chandrababu Naidu) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళి.. ప్రజల నాడి.. తాజా రాజకీయ పరిస్థితులపై ..
టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ(AP CID Notice) అధికారులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ(CID) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను ..
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది అధికార వైసీపీ(YCP) నేతలు రోజుకొకరుగా చిక్కుల్లో పడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు.. సొంత ఇంట్లోంచే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పిఠాపురంలో(Pithapuram) కాపు నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సొంత కూతురే ఆయనపై తీవ్ర విమర్శలు చేయగా.. ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) వంతు వచ్చింది.
Andhra Pradesh: అధికారం మాది.. మమ్మల్ని ఎవడ్రా అడ్డుకునేది అని భావిస్తున్నారో.. తామే తోపులం అని ఫీల్ అవుతున్నారో.. రౌడీయిజం లక్షణాలో గానీ.. ఎన్నికలు దగ్గరపడుకున్నా కొద్ది అధికార వైసీపీ(YSRCP) నేతలు రెచ్చిపోతున్నారు. విపక్ష నేతలపై ప్రత్యక్ష దాడులకు తెగబపడుతున్నారు. తాజాగా అనకాపల్లి(Anakapalle) వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu) రెచ్చిపోయాడు. తన సొంత బావమరిది అని కూడా ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. జగన్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయంగా ఉంది. అద్దం(Mirror) పంపిస్తున్నా..
4వ విడత లోక్‌సభ ఎన్నికలతో పాటే(Lok Sabha Polls 2024).. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు(Voters) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఈసీ(Election Commission) ఫైనల్ లిస్ట్‌ని రిలీజ్ చేసింది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి(YSRCP) బిగ్ షాక్ తగిలింది. పల్నాడు(Palnadu) జిల్లాలోని అమరావతి(Amaravati MPP) ఎంపీపీ మేకల హనుమంతరావు యాదవ్(Hanumantharao Yadav) వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ వింగ్ ప్రెసిడెంట్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.
ఏపీలో పోలింగ్‌కు సమయం సమీపిస్తోంది. సరిగ్గా ప్రచారం ముగియడానికి పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పటినుంచి మరో ఎత్తు అన్నట్లు ఉండనున్నాయి రాజకీయ పార్టీల వ్యూహ.. ప్రతి వ్యూహాలు. గెలుపు కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదిరోజుల్లో ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు శ్రమిస్తున్నాయి.
వైసీపీ మేనిఫెస్టో (YSRCP Manifesto) విడుదల కావడంతో.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా..? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.