Home » AP Secretariat Employees Association
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21వేల మెజారిటీనే వచ్చింది. మిగతా ఓట్లను రేవంత్ బీజేపీకి వేయించారా..?
వైసీపీ అభ్యర్థిగా ఎండీ ఇంతియాజ్‌ను బరిలో దింపితే.. కూటమి అభ్యర్థిగా టీజీ భరత్‌ను టీడీపీ బరిలో నిలిపింది. ఇక గత ఎన్నికల్లో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హాఫీజ్ ఖాన్ బరిలో నిలిచి.. గెలిచారు..
ఈ ఎన్నికల్లో ఎలాగైన అధికారం అందుకోవాలని ప్రధాని మోదీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు.. మూడో దశ పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీతోపాటు ఆయన పార్టీపై సోనియాగాంధీ గాంధీ మండిపడ్డారు.
ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినా అధికార వైసీపీ (YSRCP) అక్రమాలకు పాల్పడుతూనే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధికార వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చింది. దీంతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది.
Telangana: కరీంనగర్లో జరిగే బీఆర్ఎస్ ‘‘కదన భేరి’’ సభకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరంగా ఉండనున్నారు. గత రెండు రోజులుగా కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఈరోజు (మంగళవారం) జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో మాజీ మంత్రి చికిత్స తీసుకుంటున్నారు.
పేరుకే ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు! చేసేది మాత్రం ముఖ్యమంత్రి జగన్ భజన! ఆయనే... రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల సంగతి పక్కనపెట్టి... శ్రుతిమించిన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు...