Manipur: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి | Rahul Gandhi posts 5-minute-long video on Manipur visit, has a message for PM Narendra Modi VVNP
Share News

Manipur: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:39 PM

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గతేడాది మేలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విజ్జప్తి చేశారు.

 Manipur: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జులై 11: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గతేడాది మేలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విజ్జప్తి చేశారు. ఆ రాష్ట్ర ప్రజల వేదన వినాలని ప్రధాని మోదీకి ఈ సందర్బంగా రాహుల్ గాంధీ సూచించారు. అందుకు సంబంధించిన 5 నిమిషాలు నిడివి గల ఓ వీడియోను గురువారం రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మణిపూర్ రాష్ట్రం రెండుగా విభజితమైందన్నారు. మణిపూర్‌లో ఘర్షణలు అనంతరం ఆ రాష్ట్రానికి తాను మూడోసారి వెళ్లానన్నారు.

Also Read: Peshawar: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

ABN ఛానల్ ఫాలో అవ్వండి

నాటికి నేటికి ఆ రాష్ట్రంలో పరిస్థితుల్లో ఏటువంటి మార్పు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం రెండుగా విడిపోయిందన్నారు. ఆ రాష్ట్రంలో వేలాది మంది ప్రజలు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే మగ్గిపోతున్నారని తెలిపారు. ఆ రాష్ట్రంలో ఇళ్లు కాలిపోతున్నాయి.. అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వేలాది కుటుంబాలు సహాయక శిబిరాల్లో నివసించవలసి వస్తుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఒకసారి మణిపూర్‌లో పర్యటించి ప్రజల ఆవేదనను వినాలన్నారు. అలాగే రాష్ట్రంలో శాంతి నెలకొంటుందంటూ మణిపూర్ ప్రజలకు భరోసా కల్పించాలని ప్రధాని మోదీకి సూచించారు. మరోవైపు మణిపూర్‌లో శాంతి నెలకోల్పాలంటూ పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఒత్తిడి తీసుకు వచ్చాయని గుర్తు చేశారు. అయితే తమ పోరాటాన్ని మోదీ ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసిందో అంతా చూశారన్నారు.

Also Read: IAS officer: పూజా కేడ్కర్ ‘డిమాండ్లు’.. వాట్సప్‌ చాట్ వైరల్


జులై 8వ తేదీన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సహాయక శిబిరాల్లోనున్న ప్రజలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ.. తమకు భద్రత కల్పించాలన్నారు. తాము.. తమ ఇంటికి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నాళ్లిలా ఈ సహాయక శిబిరాల్లో తలదాచుకోవాలంటూ రాహుల్‌కు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. అలాగే మణిపూర్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ.. ఆ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉకేతో భేటీ అయ్యారు. అనంతరం రాహుల్ ఇంపాల్‌లో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు అపదలో పడ్డారన్నారు. ఆస్తులన్నీ నాశమయ్యాయిని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విపరీతమైన విషాదం నెలకొందన్నారు. గతంలో పరిస్థితులకు నేటి పరిస్థితులుకు చాలా మార్పు వచ్చి ఉండవచ్చని తాను భావించానని...కానీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదని రాహుల్ గాంధీ ఈ విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 11 , 2024 | 05:23 PM

News Hub