Share News

Jammu and Kashmir: ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు జవాన్లు మృతి

ABN , Publish Date - Jan 04 , 2025 | 03:12 PM

రోడ్డు జారుడుగా ఉండటంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని, స్థానికులు, సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని అధికారులు తెలిపారు.

Jammu and Kashmir: ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు జవాన్లు మృతి

శ్రీనగర్: నార్త్ కశ్మీర్‌లోని బండిపొర (Bandipora) జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం సైనికులతో వెళ్తున్న వాహనం ఎస్‌కే పయీన్ ప్రాంతంలో మలుపు తిరుగుతుండగా రోడ్డుపై నుంచి జారి కిందనే ఉన్న లోయలో పడింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ మరో కీలక హామీ


రోడ్డు జారుడుగా ఉండటంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని, స్థానికులు, సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వాహనం నుంచి బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు జవాన్లు మృతి చెందినట్టు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని అడ్వాన్స్ మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం శ్రీనగర్ ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రమాద ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.


ఇవి కూడా చదవండి..

Grameen Bharat Mahotsav 2025: రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

BJP: ఖర్గే రాజీనామా చేసే వరకు పోరాటం..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 04 , 2025 | 03:18 PM