Home » Arvind Kejriwal
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం పీఎ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ గురువారం సమన్లు జారీ చేసింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్జప్తి చేశారు. గురువారం లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు.
కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేదో సాధారణ తీర్పు అని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలా మంది.. కేజ్రీవాల్‌కు (కోర్టు) స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నమ్ముతున్నారు’’ అని ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. బీజేపీలో ఉన్న ఆనవాయితీ ప్రకారం.. 75 ఏళ్ల వయసు రాగానే.. అంటే 2025లో మోదీ రిటైర్ అవుతారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపైనా అమిత్ షా స్పందించారు.
కేజ్రీవాల్‌ని(CM Arvind Kejriwal) ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల ప్రచారం కోసం జూన్ 1వ తేదీ వరకూ మధ్యంతర బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో రెండో రోజైన ఆదివారంనాడు కూడా రోడ్‌షో కొనసాగించారు. తమ పార్టీకి గరిష్టంగా ఓట్లు వేస్తే 20 రోజుల తర్వాత తాను జైలుకు తిరిగి వెళ్లక్కరలేదని అన్నారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దశల వారీగా జరుగుతున్నా.. ఇప్పటికీ ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనేది క్లారిటీ రాలేదు. కొందరు బడా నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ.. కూటమి మాత్రం ఇంతవరకూ..
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 గ్యారంటీలు అమలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో తమ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద విడుదలయిన సంగతి తెలిసింది. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ను కలిశారు.
కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో జైలు నుంచి శుక్రవారం విడుదలైన కేజ్రీవాల్ శనివారం ఆప్ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
అమిత్‌షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి, 'ఆప్' సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ శనివారంనాడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ''ఆల్కహాల్ ప్రభావం''తో ఆయన ఇలా మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించింది.