Home » Arvind Kejriwal
దిల్లీ మద్యం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) జారీ చేసిన ఆర్డర్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈడీ.. కాగితాలు, కంప్యూటర్ ను తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలంటూ మంత్రి అతిశీని ప్రశ్నించింది.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో (Aam Admi Party) పాటు ఇతర ప్రతిపక్షాలు ఆయన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. కేంద్రంలోని బీజేపీపై (BJP) విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయమని అన్నారు.
మద్యం కుంభకోణానికి (Liquor Scam) సంబంధించిన రికార్డులను కలిగి ఉన్న తన పాత ఫోన్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వదిలించుకున్నారని ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ వాదనల్ని తోసిపుచ్చిన ఆప్.. ఈ విచారణ బీజేపీ (BJP) కార్యాలయం నుంచి జరుగుతోందంటూ ఆరోపించింది.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఆప్ నేత అతిశీ కీలక ప్రకటన చేశారు. దిల్లీ మద్యం కేసులో తమ నాయకుడు కేజ్రీవాల్ ( Kejriwal ) ను అన్యాయంగా ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా తాము హోలీ ఆడలేకపోతున్నట్లు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన్ని మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి తీసుకోవడంతో అధికారులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని అధికారులు అంటున్నారు. ఆయన్ని విచారిస్తున్న క్రమంలో ఊహించని ఓ ట్విస్ట్ ఈడీ అధికారులకు ఎదురైంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై (Arvind Kejriwal) కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ నైతికతను కోల్పోయాడని విమర్శించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తనని అరెస్ట్ చేయడానికి హేమంత్ సోరెన్ (Hemant Soren) తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడని, ఈ విషయంలో అతడ్ని చూసి కేజ్రీవాల్ నేర్చుకోవాలని హితవు పలికారు.
లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పంపిన సమన్లను బేఖాతరు చేశారని, తద్వారా తన అరెస్ట్‌ని తానే కోరితెచ్చుకున్నారని అన్నారు. ఒకవేళ.. తనకు తొలిసారి సమన్లు వచ్చినప్పుడే స్పందించి ఉంటే, అరెస్ట్ అయ్యేవారు కాదేమోనని అభిప్రాయపడ్డారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత, బలాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఇండియా కూటమి(INDIA Bloc) మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో 'మహా ర్యాలీ' నిర్వహించనుందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం తెలిపారు.
మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జలవనరుల శాఖకు జారీ చేశారు. ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అతిషి సీఎం ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు.