BJP hits back Kejriwal: 'మందు ప్రభావం'తో మాట్లాడుతున్న కేజ్రీ.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - May 11 , 2024 | 05:59 PM
అమిత్‌షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి, 'ఆప్' సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ శనివారంనాడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ''ఆల్కహాల్ ప్రభావం''తో ఆయన ఇలా మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించింది.
న్యూఢిల్లీ: అమిత్‌షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి, 'ఆప్' సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారంనాడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) ఘాటుగా స్పందించింది. ''ఆల్కహాల్ ప్రభావం''తో ఆయన ఇలా మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించింది.
ఎక్సైజ్ పాలసీ కేసులో మధ్యంతర బెయిలుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం విడుదలైనప్పటి నుంచి బీజేపీ (BJP), ఆప్ (AAP) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. క్రిమినల్స్‌ను కూడా పెరోల్‌కు అనుమతిస్తున్నారని, దాని అర్థం సీఎం నిర్దోషిగా నిరూపణ అయినట్టు కాదని బీజేపీ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో మోదీ త్వరలో రిటైర్ కాబోతున్నారని, తదుపరి ప్రధానిగా అమిత్‌షాను చేస్తారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంపై బీజేపీ జాతీయ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సుధాన్షు త్రివేది వెంటనే స్పందించారు. కేజ్రీవాల్ ఆల్కహాల్ ప్రభావంతో ఇలాంటి మాటలు మాడ్లాతున్నారని అన్నారు.
Arvind Kejriwal: యోగిని కూడా మోదీ వదిలిపెట్టరు.. మరో రెండు నెలల్లో..
''ఆల్కహాల్ ప్రభావమో, ఆయన (కేజ్రీవాల్) వెళ్లిన ప్రదేశం ప్రభావమో కానీ ఒక విషయం మాత్రం ఆయన నోటి నుంచి కరెక్ట్‌గా వచ్చింది. మరోసారి మోదీ ప్రధాని అవుతారని ఆయన అంగీకరించినందుకు నేను థాంక్స్ చెబుతున్నాను. ఒక్కోసారి ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి కంట్రోల్ తప్పుతుంటాడు. అప్పుడు వాస్తవాలు కొన్ని బయటకు వస్తుంటాయి. మోదీ ప్రధాని అవుతారని అంగీకరించడంతో పాటు ఆయన వారసుడెవరవుతారో కూడా చెప్పడం మొదలుపెట్టారు'' అని మీడియాతో మాట్లాడుతూ త్రివేది అన్నారు.
20 ఏళ్ల తర్వాతైనా తప్పుకుంటారా?
రాబోయే 20 ఏళ్లు 'ఆప్'ను ఏ పార్టీ అడ్డుకోలేదంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై త్రివేది స్పందిస్తూ, పదేళ్ల క్రితం ఆయన రాజకీయాల్లోకి రానని, కాంగ్రెస్ మద్దతు తీసుకోనని, కారు, బంగ్లా, భద్రత అవసరం లేదని చాలా చెప్పారని గుర్తుచేశారు. అయితే పదేళ్లలోనే ఆయన చాలా మారిపోయారని, 20 ఏళ్ల తర్వాతైనా ఆయన తప్పుకుంటారా? లేదా? అని ప్రశ్నించారు. కేవలం పదేళ్లలోనే న్యూ పాలిటిక్స్ పేరుతో ఆయన అతి ప్రమాదకరమైన రాజకీయాలు నడిపారని, ఇవాళ రాజకీయాలు ఈ దశకు రావడానికి ఈ తరహా పాలిటిక్సే కారణమని, కొత్త తరహా రాజకీయాలతో ప్రయోగం చేసే సమయం ఇది కాదని అన్నారు. సమర్ధుడు, కాలపరీక్షకు నెగ్గిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పటిష్ట జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇదే మంచి తరుణమని త్రివేది సూచించారు.
Read Latest National News and Telugu News