Home » Bangladesh
పశ్చిమబెంగాల్లోని సిలిగురి కారిడార్ యొక్క మరోపేరు చికెన్ నెక్. కోడి మెడ ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే ఒక సన్నని భూభాగం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న 20 నుంచి 22 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది.
China-Bangladesh: చైనా పర్యటన సందర్భంగా బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఇండియాతో శత్రుత్వం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతం ఇచ్చాడు. భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేకపోవడం, బంగ్లాదేశ్ మాత్రమే బంగాళాఖాతాన్ని సంరక్షించేది అని చెప్పారు. చైనా బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చన్నారు.
Modi - Muhammad Yunus: పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆ దేశంలో హిందువులపై హింసాత్మక దాడులు తీవ్రమయ్యాయి. ఇరుదేశాల మధ్య దూరం పెరుగుతున్న సమయంలో బుధవారం 53వ స్వాతంత్ర్య దినోత్సవం చేసుకున్న బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus)కు ప్రత్యేక లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గుండె పోటుకు గురయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై హింసను ఎదుర్కొంటున్నారంటూ అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గాబార్డ్ చేసిన ఆరోపణలను బాంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వం తోసి పుచ్చింది. అవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొంది.
Bangladesh: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫెయిల్యూర్ పలువురు క్రికెటర్ల కెరీర్లకు ఎండ్ కార్డ్ వేస్తోంది. ఒక్కొక్కరుగా కొందరు సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ బాట పడుతున్నారు. తాజాగా ఓ బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతదేశ పాత్రను తగ్గిస్తూ ఆ దేశం మధ్యంతర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసింది.
Champions Trophy 2025: పాకిస్థాన్ జట్టు ఏం చేసినా రివర్స్ అవుతోంది. గ్రహచారం బాగోలేదేమో.. ఆ టీమ్ బంగారం ముట్టుకున్నా ఇప్పుడు బొగ్గు అయిపోతుంది. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ నుంచి తప్పుకున్న దాయాదికి మరో గట్టి షాక్ తగిలింది.
ఓ వైమానిక దళ వైమానిక స్థావరంపై సోమవారం దుండగులు దాడి చేశారు. ఆ క్రమంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అయితే ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.