Share News

బంగాళాఖాతానికి మేమే సంరక్షకులం యూనస్‌

ABN , Publish Date - Apr 01 , 2025 | 03:41 AM

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేకపోవడం, బంగ్లాదేశ్ మాత్రమే బంగాళాఖాతాన్ని సంరక్షించేది అని చెప్పారు. చైనా బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చన్నారు.

బంగాళాఖాతానికి మేమే సంరక్షకులం యూనస్‌

న్యూఢిల్లీ, మార్చి 31: ‘‘శాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గమే లేదు. బంగ్లాదేశే వాటికి సముద్ర మార్గాన్ని అందిస్తోంది. బంగాళాఖాతానికి మేమే ఏకైక సంరక్షకులం. బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా తన వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు’’ అని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధానమంత్రి మహ్మద్‌ యూనస్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. యూనస్‌ ఇటీవల చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూనస్‌ తన పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా సమావేశమయ్యారు. తీస్తా నదీ జలాల నిర్వహణ కోసం 50 సంవత్సరాల మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించాలని జిన్‌పింగ్‌ను కోరారు.


ఇవి కూడా చదవండి:

హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన టోల్ ట్యాక్స్

నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

Updated Date - Apr 01 , 2025 | 03:41 AM