Home » Bangladesh
బంగ్లాలోని ఇస్కాన్ భక్తులు, ఇతర మైనారిటీలను రక్షించాలని కృష్ణ భగవానుని కోరుతూ డిసెంబర్ 1న ఇస్కాన్ ఆలయాలు, కేంద్రాల్లో జరిగే 'శాంతి ప్రార్థనల్లో' అందరూ పాల్గొనాలని సామాజిక మాద్యమం 'ఎక్స్'లో ఇస్కాన్ కోరింది.
స్వీయ రక్షణకోసం ప్రజాస్వామ్యబద్ధంగా హిందువులు గళం వినిపిస్తుంటే, ఆ స్వరాన్ని అణిచివేసేందుకు బంగ్లా ప్రభుత్వం చట్టవ్యతిరేక మార్గాలను అనుసరిస్తున్నట్టు కనిపిస్తోందని హోసబలే ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకుంటోందని అన్నారు.
కోల్‌కతాలోని మానిక్తలా ప్రాంతంలోని జేఎన్ రాయ్ ఆసుప్రతి ఉంది. ఇండియాకు జరుగుతున్న అవమానానికి నిరసనగా తాము బంగ్లాదేశీయులకు వైద్యచికిత్స అందించరాదనే నిర్ణయం తీసుకున్నట్టు ఆసుపత్రి అధికారి సుభ్రాన్షు భక్త్ తెలిపారు.
బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాకాండపై జైశంకర్ లోక్‌సభలో శుక్రవారనాడు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2024 ఆగస్టు నుంచి హిందువులు, మైనారిటీలపై పలుమార్లు దాడులు జరిగిన ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని చెప్పారు.
షేక్ హసీనాను గద్దెదింపిన తర్వాత బంగ్లాదేశ్ జమాతే ఇస్లామి సహా తీవ్రవాద సంస్థలు మళ్లీ చురుకుగా పనిచేస్తున్నాయని, హిందూ ఆలయాలు, ఆరాధనా స్థలాలపై దాడులు చేయడం నిత్యకృత్యంగా మారుతున్నాయని బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ చెప్పారు.
బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయి. పలువురు ఇస్లామిక్ వాదులు హిందువులకు వ్యతిరేకంగా ర్యాలీలు చేసి దేవాలయాలను ధ్వంసం చేయడంతోపాటు దాడులు చేసి దేశం విడిచి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తున్నారు.
కృష్ణదాస్ అరెస్టుతో హిందువులు ఆందోళన బాట పట్టినందున 'ఇస్కాన్'ను నిషేధించాలంటూ బంగ్లా హైకోర్టులో బుధవారంనాడు ఒక పిటిషన్ దాఖలైంది. పరిస్థితులు మరింత క్షీణించకుండా చిట్టగాంగ్, రంగపూర్‌లో అత్యవసర పరిస్థితి విధించాలని కోరింది.
కోర్టు వెలుపల పోలీసు వ్యాను నుంచే కృష్ణదాస్ తన అనుచరులకు విక్టరీ సంకేతాలిస్తూ, ఐక్య బంగ్లాదేశ్‌ను తాము కోరుకుంటున్నట్టు సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటం, నాయబద్ధమైన డిమాండ్ల కోసం పనిచేస్తు్న్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైశ్వాల్ పేర్కొన్నారు. హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించామని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.
బంగ్లాలోని షేక్ హసీనా ప్రభుత్వం ఇటీవల రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం తారాస్థాయికి చేరుకోవడంతో పతనమైంది. షేక్ హసీనా దేశం విడిచిపెట్టి వెళ్లడంతో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాలో కొలువుదీరింది.